స్మాల్‌, మిడ్‌క్యాప్‌ షేర్లను ఇప్పుడు కొనవచ్చా..?

16 Jul, 2020 16:18 IST|Sakshi

స్టాక్‌ మార్కెట్లో ఇటీవల స్మాల్‌, మిడ్‌క్యాప్‌ కంపెనీల షేర్ల సందడి కనిపిస్తోంది. రిటైల్‌ ఇన్వెస్టర్ల దగ్గర నుంచి రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా, రాధాకృష్ణ ధమాని లాంటి ఏస్‌ ఇన్వెస్టర్ల వరకు మిడ్‌, స్మాల్‌క్యాప్‌ షేర్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ జూన్‌ క్వార్టర్‌లో కొన్ని స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ కంపెనీల్లో పెద్ద ఇన్వెస్టర్లు భారీగా వాటాలను పెంచుకున్నట్లు గుణాంకాలు చెబుతున్నాయి.  

ఫస్ట్‌సోర్స్‌ సెల్యూషన్స్‌లో ఝున్‌ఝున్‌వాలా ఈ క్యూ1లో అదనంగా 57లక్షల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. రాధాకృష్ణ ధమాని ఇదే జూన్‌ క్వార్టర్లో కళ్యాణి గ్రూప్‌నకు చెందిన బీఎఫ్‌ యుటిలిటీస్‌లో 1.3శాతం ఈక్విటీ వాటాను దక్కించుకున్నారు. అలాగే అస్ట్రా మైక్రోవేవ్‌ ప్రాజెక్ట్స్‌లో 1.03శాతం వాటాకు సమానమైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. ఈ రెండు కంపెనీలు స్మాల్‌క్యాప్‌ రంగానికి చెందినవి. అయితే చాలా మిడ్‌క్యాప్‌ కంపెనీల్లో వాటాలను పెంచుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 

ఈఏడాది ప్రారంభం నుంచి ఈ జూలై 14నాటికి బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 11శాతం పతనమైంది. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 8శాతం నష్టాన్ని చవిచూసింది. అయితే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ మాత్రం 13శాతం క్షీణించింది. 

ఈ సమయంలో మిడ్, స్మాల్‌క్యాప్‌ కొనవచ్చా..?
గత కొన్నేళ్లు స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ షేర్లు ఆశించిన స్థాయిలో లాభపడలేదు. ఇప్పుడు ర్యాలీ చేసేందుకు సిద్ధమయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మధ్య, ధీర్ఘకాలిక దృష్ట్యా నాణ్యత కలిగిన మిడ్‌, స్మాల్‌క్యాప్‌ షేర్ల ఎంపిక సరైనదేనని విశ్లేషకులు అంటున్నారు. తక్కువ వాల్యూయేషన్లతో ఆకర్షణీయమైన ధరల వద్ద ట్రేడ్ అవుతుండటంతో ఇటీవల స్మాల్‌, మిడ్‌క్యాప్‌ షేర్లు ర్యాలీ చేస్తున్నాయని ఏంజెల్‌ బ్రోకింగ్‌ సంస్థ తెలిపింది. 

కోటక్‌ సెక్యూరిటీస్‌ సిఫార్సులు: డీసీబీ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌, కల్పతరు పవర్‌ ట్రాన్స్‌ మిషన్స్‌, కాస్ట్రోల్‌ ఇండియా, సువెన్‌ ఫార్మాస్యూటికల్స్‌, పీఎన్‌సీ ఇన్ఫ్రాటెక్‌ స్మాల్‌క్యాప్‌ షేర్లు: హాక్విన్స్‌ కుకర్‌, స్వరాజ్‌ ఇంజన్స్‌, రాడికో ఖేతన్‌, అమృతాంజన్‌ హెల్త్‌కేర్‌, కేఈఐ ఇండస్ట్రీస్‌ 

మరిన్ని వార్తలు