వొడాఫోన్‌లో గూగుల్‌ పెట్టుబడులు!

28 May, 2020 17:30 IST|Sakshi

వొడాఫోన్‌లో వాటాకు టెక్‌ దిగ్గజం ఆసక్తి

సాక్షి, న్యూఢిల్లీ : టెక్‌ దిగ్గజం గూగుల్‌ వొడాఫోన్‌ ఇండియాలో 5 శాతం వాటా కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తోంది. ఈ డీల్‌ ఖరారైతే రూ వేలాది కోట్ల నష్టాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న వొడాఫోన్‌కు ఊరట కలిగే అవకాశం ఉంది. రిలయన్స్‌ జియోలో ఫేస్‌బుక్‌ పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో వొడాఫోన్‌ ఇండియాలో వాటా కొనుగోలుకు గూగుల్‌ సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. వొడాఫోన్‌ ఇండియాలో గూగుల్‌ 5 శాతం వాటా కొనుగోలు చేయనుందని ఫైనాన్షియల్‌ టైమ్స్‌ వెల్లడించిండి.

ఈ ఒప్పందం ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నందున ఒప్పందంలో మార్పులు చోటుచేసుకోవచ్చని తెలిపింది. రిలయన్స్‌ జియోలో ఫేస్‌బుక్‌ పదిశాతం వాటా కొనుగోలుకు ముందుకొచ్చిన నేపథ్యంలో వొడాఫోన్‌లో గూగుల్‌ పెట్టుబడుల అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు జియోతో ఫేస్‌బుక్‌ ఒప్పందం ఖరారు కాకముందే జియోలో వాటా కొనుగోలుకు గూగుల్‌ ఆసక్తి కనబరిచినట్టు ప్రచారం సాగింది. టెక్‌ దిగ్గజాలు గూగుల్‌, ఫేస్‌బుక్‌లు టెలికాం రంగంలోకి ప్రవేశించడంతో టెలికాం మార్కెట్‌లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయనే ఉత్కంఠ నెలకొంది.

చదవండి : గూగుల్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్

మరిన్ని వార్తలు