గూగుల్ ఆన్‌లైన్ షాపింగ్ సక్సెస్

13 Dec, 2014 01:55 IST|Sakshi
గూగుల్ ఆన్‌లైన్ షాపింగ్ సక్సెస్

1.4 కోట్లకు చేరిన హిట్స్

న్యూఢిల్లీ: గూగుల్ గ్రేట్ ఆన్‌లైన్ షాపింగ్ ఫెస్టివల్ (జీఓఎస్‌ఎఫ్) విజయవంతమైందని ఆన్‌లైన్ సెర్చింజన్ గూగుల్ పేర్కొంది. గుంటూరు, హుబ్లి,రాంచి తదితర చిన్న పట్టణాల నుంచి వినియోగదారులు తమ మొబైల్ ఫోన్ల ద్వారా ఈ ఆన్‌లైన్ షాపింగ్‌లో జోరుగా పాల్గొన్నారని గూగుల్ ఇండియా ఇండస్ట్రీ డెరైక్టర్ (ఈకామర్స్) నితిన్ బవన్‌కులే చెప్పారు. శుక్రవారం ముగిసిన ఈ మూడు రోజుల షాపింగ్ కు 80 లక్షల హిట్స్ వచ్చాయని, ప్రమోషన్ పీరియడ్‌తో కూడా కలుపుకుంటే హిట్స్ సంఖ్య 1.4 కోట్లకు చేరిందని పేర్కొన్నారు.

గత ఏడాదితో పోల్చితే ఇది ఏడు రెట్లు అధికమని  దేశవ్యాప్తంగా 220 నగరాల నుంచి వినియోగదారులు ఉత్సాహాంగా ఈ ఆన్‌లైన్ షాపింగ్‌లో పాల్గొన్నారని వివరించారు. 40 శాతం మంది యూజర్లు తమ మొబైళ్ల ద్వారానే ఈ షాపింగ్‌ను యాక్సెస్ చేశారని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్, లైఫ్ స్టైల్, వంటగది పరికరాలు అధికంగా అమ్ముడయ్యాయని తెలిపారు. 500 ఇళ్లు, 50 కార్లు, 100 బైక్‌లు అమ్ముడయ్యాయని వివరించారు.

మరిన్ని వార్తలు