బోర్‌ కొట్టిందని బగ్‌ కనుగొన్నాడు..

15 Aug, 2017 16:59 IST|Sakshi
బోర్‌ కొట్టిన ఓ పాఠశాల‌... ఖాళీగా ఉండలేక గూగుల్‌లో బగ్‌ను పట్టేశాడు. తమ సెక్యురిటీ లోపాన్ని కనుగొన్న ఆ స్కూల్‌ స్టూడెంట్‌కు గూగుల్‌ కంపెనీ 10వేల డాలర్ల రివార్డు అందించింది. వివరాల్లోకి వెళ్తే... ఉరుగ్వేయన్‌కు చెందిన ఇజిక్వైల్‌ పరెర పాఠశాల విద్యార్థి, తనకు బోర్‌ కొడుతుందని, గూగుల్‌లో బగ్‌ కనుగొనడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. పలు సార్లు విఫలమైన తర్వాత ఒక అంతర్గత వెబ్‌పేజ్‌, యూజర్‌ పేరు, ఇతర సమాచారం అవసరం లేకుండానే యాక్సస్‌ అవుతున్నట్టు గుర్తించాడు. వెంటనే ఆ విషయాన్ని గూగుల్‌కు తెలియపరిచాడు. తన దగ్గర గూగుల్‌ సర్వీసెస్‌, ఇన్‌ఫ్రాక్ట్ర్చర్‌ గురించి చాలా లింక్స్‌ ఉన్నాయని కానీ ఏ సెక్షన్‌ అయినా తాను విజిట్‌ చేసేముందు గూగుల్‌ కాన్ఫెడెన్సియల్‌ అనే కింద కనిపిస్తుందని తన బ్లాగ్‌లో పేర్కొన్నాడు.
 
ఇది చాలా చిన్న విషయమని తాను భావించినట్టు, అంత ముఖ్యమైనది కూడా కాదని భావించినట్టు ఆ విద్యార్థి తెలిపాడు. ఆ వెబ్‌సైట్‌లో ఎలాంటి కంటెంట్‌ ఉందో కూడా తనకు తెలియదని, కానీ కొన్ని రోజుల తర్వాత గూగుల్‌ సెక్యురిటీ టీమ్‌ నుంచి వచ్చిన ఈమెయిల్‌ చూసిన తాను అందించిన సమాచారం చాలా విలువైనదిగా భావించినట్టు పేర్కొన్నాడు. తర్వాత దాన్ని బగ్‌గా ధృవీకరించి, 10వేల డాలర్లను గూగుల్‌ చెల్లించింది. తమ నెట్‌వర్క్స్‌లో బగ్‌లను కనుగొంటున్న వారికి గూగుల్‌ రివార్డులను అందిస్తోంది. ఆండ్రాయిడ్‌ ఓఎస్‌లో బగ్‌ను గుర్తించిన వారికి గూగుల్‌ తాను చెల్లించే బౌంటీని అత్యధికంగా 2లక్షల డాలర్లకు పెంచింది. 
 
మరిన్ని వార్తలు