యాపిల్‌ ? గూగుల్‌? ఏది బెటర్‌ - ఆనంద్‌ మహీంద్రా 

18 Sep, 2019 16:43 IST|Sakshi

అమెరికా:  మహీంద్ర అండ్‌  మహీంద్ర ఛైర్మన్‌ ఆనంద్ మహీంద్ర మరోసారి సోషల్‌ మీడియాలో నెటిజనులకు పని చెప్పారు. ప్రముఖ మొబైళ్ల ద్వారా ఒకే ప్లేస్‌లో తీసిన రెండు ఫోటోలను ట్విటర్‌లో పో​స్ట్‌ చేశారు. వీటిల్లో ఏది బెటరో చెప్పమంటూ ట్వీట్‌ చేశారు. దీంతో  యాపిల్‌, గూగుల్‌ పిక్సెల్‌ స్మార్ట్‌ఫోన్ల ప్రేమికుల మధ్య చిన్నపాటి వార్‌ మొదలైంది.

కొత్తగా మార్కెట్‌లోకి విడుదలైన గూగుల్‌ పిక్స్‌ల్‌, ఐఫోన్‌10 కెమెరా చిత్రాలను వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా రివ్యూ చేసి శనివారం​ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. మాన్‌హట్టన్‌ వేదికగా రెండు రకాల కెమెరాలను ఒకే  ప్లేస్‌లో, ఒకే కోణంలో, ఒకే సమయంలో చిత్రీకరించానని ఆనంద్‌ మహీంద్రా తెలిపారు. తాను తీసిన ఫోటోల నాణ్యతపై  న్యాయనిర్ణేతలుగా  మీరే వ్యవహరించాలని ఆయన కోరారు. దీంతో దుమారం రేగింది. అటు పాజిటివ్‌, ఇటు నెగిటివ్‌ కామెంట్లతో ట్విటరేటియన్లు ఆయనపై విరుచుకుపడ్డారు. 

అటు ఆపిల్‌ ఆభిమానులు కూడా ఆనంద్‌ ట్వీట్‌పై మండిపడ్డారు. అలాగే ఆనంద్‌ మహీంద్ర యాపిల్‌ 11 ప్రొ కు ఇంకా అప్‌డేట్‌ అవలేదా మరో యూజర్‌ కమెంట్‌ చేశారు. గూగుల్‌ పిక్సల్‌ చిత్రాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అయితే అంతిమంగా సబ్జెక్ట్, ఫోకస్‌నే నమ్ముతానంటూ త్యాగి అనే నెటిజన్‌ రిప్లై ఇచ్చాడు. మరోవైపు యాపిల్‌ను సరియైన లెన్స్‌లతో చిత్రీకరించలేదంటూ మరో నెటిజన్‌ జెర్క్‌ తన  అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. 

మరిన్ని వార్తలు