ప్రతి ఉత్పత్తిలో పునరుత్పాదక ప్లాస్టిక్‌: గూగుల్‌

6 Aug, 2019 16:35 IST|Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో :  2022 నాటికి తమ ప్రతి ఉత్పత్తిలో పునరుత్పాదక (రీసైకిల్డ్‌) ప్లాస్టిక్‌ను వినియోగించనున్నామని  ఆల్ఫాబెట్ ఇంక్‌ గూగుల్ ప్రతిజ్ఞ చేసింది. వచ్చే ఏడాది నాటికి కార్బన్ ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రయత్నిస్తామని సోమవారం ప్రకటించింది. గూగుల్‌ కొత్తగా తీసుకొన్న ఈ నిర్ణయంతో పర్యావరణంలో కార్బన్‌ ఉద్గారాల విడుదలను తగ్గించేందుకు కట్టుబడి ఉన్నామంటు ఇది వరకే ప్రతిజ్ఞ చేసిన టెక్ కంపెనీల జాబితాలో చేరింది. 

గూగుల్‌  నుంచి ఉత్పత్తి అయ్యే  మొబైల్‌ ఫోన్లు, స్పీకర్లు, ల్యాప్‌టాప్‌లను తరలించడానికి విమానాలకు బదులు ఓడలపై ఎక్కువ ఆధారపడటంతో తమ కంపెనీ రవాణాకు సంబంధించిన కార్బన్ ఉద్గారాలు 2017తో పోలిస్తే గత ఏడాది 40 శాతం పడిపోయాయని గూగుల్ పరికరాలు, సేవల విభాగాధిపతి ‘అన్నా మీగన్’ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. గూగుల్ కంపెనీ హార్డ్‌వేర్ వ్యాపారంలో అడుగుపెట్టి కేవలం 3 సంవత్సరాలే అయినప్పటికి, తమ ప్రత్యర్థి ఆపిల్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తోందని మీగన్ వెల్లడించారు.

తమ సంస్థ ఆన్‌లైన్‌లో విక్రయించే గూగుల్ హోమ్ స్పీకర్లు, యూఎస్‌బీ, పెన్‌డ్రైవ్‌లు ప్రతి తొమ్మిది గూగుల్ ఉత్పత్తులలో మూడింటికి ప్లాస్టిక్‌ను 20 శాతం నుంచి 42శాతం  వరకు తిరిగి వినియోగించవచ్చనే అంశాన్ని గూగుల్‌ వర్గాలు పరిశీలిస్తున్నాయి. అంతేకాక ఒక బ్లాగ్ పోస్ట్‌లో గూగుల్ 2022 నాటికి 100 శాతం  రీసైకిల్డ్‌ ప్లాస్టిక్‌ ఉత్పత్తులను మార్కెట్లో తీసుకురావడానికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది.

మరిన్ని వార్తలు