ప్లే స్టోర్‌లో క‌నిపించ‌ని మిట్రాన్‌

2 Jun, 2020 20:42 IST|Sakshi

న్యూఢిల్లీ: క్యారిమీన‌టి ఉదంతం, చైనా యాప్ బ‌హిష్క‌ర‌ణ నినాదం‌.. ఈ రెండూ టిక్‌టాక్‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించాయి. ఫ‌లితంగా యాప్ ‌రేటింగ్స్ దారుణంగా ప‌డిపోయాయి‌. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో నెగెటివ్ రివ్యూల తొల‌గింపు పేరుతో గూగుల్ టిక్‌టాక్‌కు అండ‌గా నిలిచింది. అయితే దీనిక‌న్నా ముందు టిక్‌టాక్ క‌ష్ట‌కాలాన్ని ఉప‌యోగించుకుంటూ స్వ‌దేశీ యాప్ పేరిట‌ 'మిట్రాన్' తెర‌మీద‌కు వ‌చ్చింది. దీంతో అప్ప‌టికే చైనాపై వ్య‌తిరేక‌త ఉన్న నెటిజ‌న్లు పెద్ద ఎత్తున ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేశారు. త‌క్కువ కాలంలోనే దీని డౌన్‌లోడ్‌ల సంఖ్య 5 మిలియ‌న్లు దాటిపోయింది. 4.7 రేటింగ్‌తో తిరుగులేని యాప్‌గా నిలిచింది. ఇలా బ్రేకులు లేకుండా దూసుకుపోతున్న మిట్రాన్‌కు గూగుల్ స‌డ‌న్‌ షాకిచ్చింది. (మిట్రాన్‌ యాప్‌.. అసలు కథ ఇది!)

భ‌ద్ర‌తా స‌మ‌స్య‌ల కార‌ణంగా ప్లే స్టోర్‌లో మిట్రాన్ యాప్‌ను తొల‌గించిన‌ట్లు గూగుల్ పేర్కొంది. సైబ‌ర్ నిపుణులు సైతం విని‌యోగ‌దారుల వివ‌రాలు గోప్యంగా ఉంచేందుకు యాప్ డెవ‌లప‌ర్స్ ఎటువంటి భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు పాటించ‌లేద‌ని తెలిపారు. వీలైతే యాప్‌ను డిలీట్ చేయాల్సిందిగా కోరారు. కాగా ఈ యాప్‌ను రూర్కే ఐఐటీ విద్యార్థి శిబంక్ అగ‌ర్వాల్ తయారు చేసినట్లు ప్రచారం జ‌రిగింది. దీనిపై క్యూబాక్స‌స్ వ్య‌వ‌స్థాప‌కుడు ఇర్ఫాన్‌ షేక్ మాట్లాడుతూ.. 'త‌మ‌ సంస్థ యాప్‌ సోర్స్‌ కోడ్‌ను స‌ద‌రు విద్యార్థికి విక్ర‌యించాం. అత‌ను దాన్ని మిట్రాన్ పేరిట భార‌త్‌లో విడుద‌ల చేశాడు' అని పేర్కొన్న విష‌యం తెలిసిందే. (ట్రంపొకరు కిమ్మొకరు)

>
మరిన్ని వార్తలు