ఈ యాప్‌లు మీ ఫోన్‌లో ఉన్నాయో.. ఇక అంతే!

10 Jan, 2019 11:38 IST|Sakshi

ప్లే స్టోర్‌లో ఉన్న ప్రమాద‍కరమైన 85 రకాల అప్లికేషన్లను తొలగిస్తున్నట్టు గూగుల్‌ తెలిపింది. ఆండ్రాయిడ్‌ ప్లే స్టోర్‌లో గేమ్‌, టీవీ అండ్‌ రిమోట్‌ కంట్రోల్‌ సిములేటర్‌ వంటి యాప్స్‌ ద్వారా డేటా చోరీకి గురయ్యే అవకాశం ఉందని పేర్కొంది. కాగా ఈ విషయాన్ని ట్రెండ్‌ మైక్రో అనే సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ మొదట రిపోర్టు చేసింది.

‘ఫుల్‌ స్క్రీన్‌ యాడ్స్‌ను ప్రజెంట్‌ చేస్తూ, డివైస్‌ స్క్రీన్‌ అన్‌లాకింగ్‌ పనితీరును గమనించే ఇటువంటి యాప్‌లు చాలా ప్రమాదకరం. అయితే ఇప్పటికే ఈజీ యూనివర్సల్‌ టీవీ రిమోట్‌ అనే యాప్‌ను యూజర్లు 50 లక్షల సార్లు డౌన్‌లోడ్‌ చేశారు. అంతేకాదు ఇటువంటి మరిన్ని 85 హానికారక యాప్‌లు కూడా 9 మిలియన్ల సార్లు డౌన్‌లోడ్‌ చేయబడ్డాయి. ఈ యాప్‌లు ఓపెన్‌ చేసిన ప్రతిసారీ ఫుల్‌ స్క్రీన్‌ యాడ్‌ డిస్‌ప్లే అవుతుంది. దాని నుంచి బయటికి వచ్చేందుకు వరుసగా వివిధ రకాల బటన్స్‌ నొక్కమంటూ ఆప్షన్స్‌ వస్తూనే ఉంటాయి. అలా అనేక రకాల వెబ్‌పేజీల్లోకి మన వివరాలు వెళ్లిపోతాయి. యాప్‌ క్రాష్‌ అయ్యేంతవరకు ఇలాగే జరుగుతూ ఉంటుంది. అదే సమయంలో మన ఫోన్‌ లాక్‌ ప్యాట్రన్‌తో పాటు ఇతర కీలక సమాచారం హ్యాకర్ల చేతికి సులభంగా చిక్కుతుంది’ అని ట్రెండ్‌ మైక్రో పరిశోధకులు తమ బ్లాగులో కథనం వెలువరించారు. ఇక గూగుల్‌ ఇలా హానికారక యాప్‌లను తొలగించడం ఇదే తొలిసారి కాదు. గతేడాది నవంబరులో 13, డిసెంబరులో మరో 22 ఫేక్‌ యాప్‌లను తొలగించింది.

మన ఫోన్లలో ఉండకూడని కొన్ని యాప్‌లు
- స్పోర్ట్‌ టీవీ
- ప్రాడో పార్కింగ్‌ సిములేటర్‌ 3డీ
-టీవీ వరల్డ్‌
-సిటీ ఎక్స్‌స్ట్రీమ్‌పోలీస్‌
-అమెరికన్‌ మజిల్‌ కార్‌
-ఐడిల్‌ డ్రిప్ట్‌
-టీవీ రిమోట్‌
-ఏసీ రిమోట్‌
-బస్‌ డ్రైవర్‌
-లవ్‌ స్టిక్కర్స్‌
-క్రిస్‌మస్‌ స్టిక్కర్స్‌
-పార్కింగ్‌ గేమ్‌
-బ్రెజిల్‌ టీవీ
- వరల్డ్‌ టీవీ
- ప్రాడో కార్‌
-చాలెంజ్‌ కార్‌ స్టంట్స్‌ గేమ్‌
- యూకే టీవీ
- ఫొటో ఎడిటర్‌ కొలాగ్‌ 1
- మూవీ స్టిక్కర్స్‌
- రేసింగ్‌ కార్‌ 3డీ
- పోలీస్‌ చేజ్‌
-ఫ్రాన్స్‌ టీవీ
- చిలీ టీవీ
- సౌతాఫ్రికా టీవీ మొదలైనవి

మరిన్ని వార్తలు