గూగుల్ కి భారీ ఊరట..

27 May, 2016 11:57 IST|Sakshi
గూగుల్ కి భారీ ఊరట..

శాన్ ఫ్రాన్సిస్కో:  టెక్ దిగ్గజం గూగుల్ కు పెద్ద   ఊరట లభించింది. మల్టీ బిలియన్ డాలర్ల దావా  కేసులో కోర్టు గూగుల్ కి  అనుకూలంగా  తీర్పునిచ్చింది. దీgతో జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్  కాపీ రైట్    వివాదంలో  రెండు టెక్నాలజీ దిగ్గజాల  మధ్య సాగిన హోరా హోరీ యుద్ధానికి  ప్రస్తుతానికి తెరపడింది.   ఈ తీర్పును పై అసంతృప్తి వ్యక్తం చేసిన ఒరాకిల్ మళ్లీ పోరుకు రడీ అవుతోంది.

ఆండ్రాయిడ్ ఎకో సిస్టమ్ విజయానికి ఈ తీర్పు నిదర్శనమని గూగుల్ వ్యాఖ్యానించింది. జావా ప్రోగ్రామింగ్ క్యమూనిటీ కాపీ రేట్స్ విషయంలో,   సాప్ట్ వేర్  అభివృధ్దిలో నూతన ఆవిష్కరణలకు  నాంది అవుతుందని ఒక ప్రకటనలో తెలిపింది.  సాఫ్ట్ వేర్ డెవలపర్లకు ఇదిముఖ్యమైన విజయమని, సృజనాత్మకతకు ప్రోత్సాహాన్నందిస్తుందని కంప్యూటర్ కమ్యూనికేషన్స్ ఇండస్ట్రీ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎడ్ బ్లాక్ చెప్పారు. ఇది ఇలా ఉంటే ఈతీర్పును వ్యతిరేకించిన ఒరాకిల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ను గూగుల్  చట్టవిరుద్ధంగా  వాడుతోందని గట్టిగా నమ్మువుతున్నామని వాదించింది.   మరోసారి అప్పీలు కు వెళ్లనున్నట్టు  స్పష్టం చేసింది.

కాగా జావా ప్రొగ్రామింగ్ లాంగ్వేజ్ లో గూగుల్ ఆండ్రాయిడ్ కాపీ రైట్ ను ఉల్లంఘించిందని  ఒరాకిల్ ఆరోపించింది. దీనికి గాను తమకు  గూగుల్ ఆ కంపెనీకి 8.8 బిలియన్ డాలర్లు(880 కోట్ల డాలర్లు) చెల్లించాలంటూ  పిటిషన్ దాఖలు చేసింది. అయితే  కాపీ రైట్ చట్టం ప్రకారం న్యాయంగానే జావా లాంగ్వేజ్ ను వాడుకుంటున్నామని, దానికి ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదంటూ ఒరాకిల్ ఆరోపణలను గూగుల్  ఖండించింది.  ఈ రెండు కంపెనీల మధ్య వాదనలు 2012లో మొదలైన సంగతి తెలిసిందే..  
 

మరిన్ని వార్తలు