సేవ్‌ డేటా.. గూగుల్‌ సరికొత్త యాప్‌

30 Nov, 2017 19:47 IST|Sakshi

సాక్షి : గూగుల్‌ మరో సరికొత్త యాప్‌ను విడుదల చేసింది. మొబైల్‌ డేటా వాడకం నియంత్రణ కోసం డేటాల్లీని ప్రవేశపెట్టింది. ఈ యాప్‌ ద్వారా వినియోగదారుడు ఎంత డేటాను వాడాడో తెలుసుకుని.. తద్వారా డేటాను సేవ్‌ చేసుకోవచ్చు. 

పైగా దీనిద్వారా మరో కీలక సమస్య కూడా పరిష్కారం అవుతుందని గూగుల్‌ ప్రకటించింది. కొన్ని కొన్నిసార్లు వాడకపోయినప్పటికీ.. బ్యాక్‌ గ్రౌండ్‌లో కొన్ని యాప్‌లు డేటాను ఆటోమేటిక్‌గా వినియోగించుకుంటాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకే డెటాల్లీ యాప్‌ బాగా సహకరిస్తుంది. తద్వారా దాదాపు 30 శాతం మొబైల్ డేటాను సేవ్ చేసే స‌దుపాయం క‌లుగుతుంది. అలాగే ఈ యాప్ ద్వారా ద‌గ్గ‌ర‌లో ఉన్న వైఫై నెట్‌వ‌ర్క్‌ల‌ను క‌నిపెట్టవ‌చ్చు. 

నాణ్య‌మైన ఇంట‌ర్నెట్ వేగాన్ని అందించే నెట్‌వ‌ర్క్‌ల‌ను ఈ యాప్ ద్వారా ఎంచుకోవ‌చ్చు. గూగుల్‌ సంబంధిత నెక్స్ట్‌ బిలియన్‌ యూజర్స్‌ దీనిని సృష్టించింది.  ప్రస్తుతం ఆండ్రాయిడ్ 5.0 ఆపైన వర్షన్ ఉన్న ఫోన్లలో.. ప్లేస్టోర్‌లో ఈ యాప్‌ అందుబాటులో ఉంది.

మరిన్ని వార్తలు