బ్రహ్మాండమైన అప్‌డేట్స్‌తో కొత్త ఐఫోన్‌, ట్రైలర్‌

14 Sep, 2019 10:38 IST|Sakshi

ఆకట్టుకుంటున్న ఐఫోన్‌ ఎస్‌ఈ 2 ట్రైలర్‌

సాక్షి, న్యూఢిల్లీ: యాపిల్‌ మరో ప్రతిష్టాత్మక స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. ఐఫోన్‌ 11 స్మార్ట్‌ఫోన్ల సిరీస్‌ లాంచింగ్‌ ముగిసిన వెంటనే తన పాపులర్‌ మోడల్‌ యాపిల్‌ ఐఫోన్‌ ఎస్‌ఆ సిరీస్‌ ఫోన్‌పై లీక్‌లు మొదలయ్యాయి. ముఖ్యంగా భారతదేశంలో తక్కువ రేటులో 2016లో తీసుకొచ్చిన ఐఫోన్‌ ఎస్‌ఈకి కొనసాగింపుగా ఎస్‌ఈ2ని లాంచ్‌ చేయనుంది. దీనికి సంబంధించిన ట్రైలర్‌ ఒకటి ఐ ఫోన్‌ ప్రేమికులను ఆకట్టుకుంటోంది.  

ఐఫోన్ఎస్‌ఈ మాదిరిగానే కొత్త ఐఫోన్‌ ఎస్‌ఈ2 ఉన్నప్పటికీ 4.7 డిస్‌ప్లేతో రానున్న ఈ డివైస్‌లో ఐఫోన్‌11 సిరీస్‌లో పొందుపర్చిన గార్జియస్‌ ఫీచర్లను అమర్చింది. యాపిల్‌కు చెందిన అత్యంత ప్రియమైన డిజైన్‌తో పాటు వెనుకవైపు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఫేస్ ఐడి నాచ్ అప్ ఫ్రంట్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ ఫ్రింట్‌ సెన్సార్ లాంటి లేటెస్ట్‌ స్పెసిఫికేషన్లతో, తక్కువ ధరలో తీసుకురానుంది. 2019 చివర్లో నిర్వహించే ఒక ఈవెంట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను  తీసుకురానుందని అంచనా.

 చదవండి : యాపిల్‌ ఐఫోన్‌ 11 వచ్చేసింది..

మరిన్ని వార్తలు