రేపటి నుంచి మొబైల్‌ సర్వీసులు బంద్‌?

6 Jan, 2018 09:08 IST|Sakshi

కొత్త ఏడాది సంబురం ఇంకా పూర్తిగా తీరనేలేదు. అప్పుడే ప్రజల్లో కలవరపెట్టే మెసేజ్‌లు. టెలికాం సబ్‌స్క్రైబర్లను టార్గెట్‌గా చేస్తూ... ఎస్‌ఎంఎస్‌ల వెల్లువ కొనసాగుతోంది. ఈ మెసేజస్‌లోని సందేశం.. జనవరి 7 నుంచి మీ నెంబర్‌పై వాయిస్‌ సర్వీసులు ఆగిపోనున్నాయని. ఇతర నెట్‌వర్క్‌లోకి మీ నెంబర్‌ను మార్చుకుంటేనే పనిచేస్తాయంటూ ఆందోళనకర మెసేజ్‌లు వస్తున్నాయి. అన్ని టెలికాం ఆపరేటర్లకు ఈ మెసేజ్‌లు వెళ్తున్నాయి. దీంతో వెంటనే కస్టమర్లు ట్విట్టర్‌ వేదికగా టెలికాం కంపెనీలకు ఫిర్యాదు చేయడం ప్రారంభించారు. 

అయితే ఈ మెసేజ్‌లను టెలికాం కంపెనీలు పంపడం లేదట. యూజర్ల  ఫిర్యాదులపై స్పందించిన జియో, వొడాఫోన్‌, ఐడియా కంపెనీలు, అది తప్పుడు మెసేజ్‌లను అని, యూజర్లు ఆ మెసేజ్‌ను పట్టించుకోవద్దంటూ క్లారిటీ ఇచ్చాయి. వాటిని తాము పంపడం లేదని కూడా పేర్కొన్నాయి. ఎయిర్‌టెల్‌ ప్రతినిధి ఆ మెసేజ్‌ను ఓ  స్పామ్‌గా ధృవీకరించారు. టాటా డొకోమో, బీఎస్‌ఎన్‌ఎల్‌ సబ్‌స్క్రైబర్లకు కూడా ఈ మెసేజ్‌లు వస్తున్నట్టు తెలిసింది. 

ఆశ్చర్యకరంగా యూపీసీను జనరేట్‌ చేసి నెంబర్‌ను వేరే నెట్‌వర్క్‌కు పోర్టు పెట్టుకోవాలంటూ యూజర్లను ఆదేశిస్తున్నాయి. అయితే ఏ  ఆపరేటర్‌కు పోర్టు పెట్టుకోవాలో చెప్పడం లేదు. ఒక్క ఆపరేటర్‌ సబ్‌స్క్రైబర్‌కు మాత్రమే కాక, ప్రతి ఆపరేటర్‌ యూజర్లకు ఈ మేరకు ఎస్‌ఎంఎస్‌లు వస్తుండటం సబ్‌స్క్రైబర్లను ఆందోళనలో పడేసింది.

జనవరి 7 ఫేక్‌ డెడ్‌లైన్‌ అని, ఆధార్‌తో మొబైల్‌ నెంబర్‌ను వెరిఫికేషన్‌ చేసుకునే ప్రక్రియకు డెడ్‌లైన్‌ 2018 మార్చి 31 వరకు ఉందని కంపెనీ పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఆధార్‌ లేనివారికైతే, మార్చి 31 డెడ్‌లైన్‌ కాగ, ఇప్పటికే ఆధార్‌ కలిగి ఉన్న వారికి సిమ్‌ వెరిఫికేషన్‌కు ఆఖరి తేది ఫిబ్రవరి 6. ఐవీఆర్‌ ద్వారా ఆధార్‌-మొబైల్‌ నెంబర్‌ సిమ్‌ రీ-వెరిఫికేషన్‌ చేపట్టుకోవచ్చని టెల్కోలు చెప్పాయి. 

మరిన్ని వార్తలు