రూ.4.91 లక్షల కోట్ల రుణ పంపిణీ

4 Dec, 2019 02:33 IST|Sakshi

అక్టోబర్, నవంబర్‌లలో ప్రభుత్వ బ్యాంకింగ్‌ గణాంకాలు  

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు అక్టోబర్, నవంబర్‌లలో రూ.4.91 లక్షల కోట్ల రికార్డు స్థాయి రుణ పంపిణీలు జరిపాయి.  వినియోగం పెంపు, ఆర్థిక వృద్ధి పునరుత్తేజం లక్ష్యంగా రుణ వృద్ధి మెరుగుపడాలని కేంద్రం భావిస్తున్న నేపథ్యంలో ఈ గణాంకాలు వెలువడ్డాయి. బ్యాంకులు వినియోగదారులను చేరుకోవాలని, వారి అవసరాలకు అనుగుణంగా తగిన అన్ని నిబంధనలూ అనుసరించి రుణ పంపిణీలు జరగాలనీ ఆరి్థకమంత్రి నిర్మలా సీతారామన్‌ సెపె్టంబర్‌లో బ్యాంకులకు విజ్ఞప్తి చేశారు. ఆరి్థకవృద్ధిలో ఇది కీలక అంశమని తెలిపారు. ఈ నేపథ్యంలో రెండు నెలల్లో బ్యాంకులు దేశ వ్యాప్తంగా 374 జిల్లాల్లో ప్రత్యేక రుణ మేళాలు నిర్వహించాయి.

ప్రత్యేకించి రుణ పంపిణీల విషయంలో లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ), నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు, కార్పొరేట్లు, రిటైల్, వ్యవసాయ విభాగాలపై దృష్టిపెట్టాయి. రుణ పంపిణీలకు సంబంధించి నిబంధనల్లో ఏ మాత్రం రాజీ పడలేదని మంగళవారం గణాంకాల విడుదల సందర్భంగా ఆరి్థకమంత్రిత్వశాఖ పేర్కొంది. అక్టోబర్‌లో రూ.2.52 లక్షల కోట్లు, నవంబర్‌లో రూ.2.39 లక్షల కోట్ల రుణ పంపిణీలు జరిగినట్లు వివరించింది.  రెండు నెలల్లో ప్రత్యేకించి ఎంఎస్‌ఎంఈలకు రూ.72,985 కోట్లు, కార్పొరేట్లకు రూ.2.2 లక్షల కోట్ల రుణ పంపిణీలు జరిగినట్లు తెలిపింది. రూ.27,225 కోట్ల గృహ రుణాలు మంజూరు అయ్యాయి. వాహన రుణాల విలువ రూ.11,088 కోట్లుగా ఉంది. విద్యకు సంబంధించి ఈ మొత్తం రూ.1,111 కోట్లు. వ్యవసాయ రుణాలు రూ.78,374 కోట్లు.   

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు