పీపీఎఫ్‌, కేవీపీ వడ్డీ రేట్ల కోత

30 Jun, 2017 16:18 IST|Sakshi
పీపీఎఫ్‌, కేవీపీ వడ్డీ రేట్ల కోత

న్యూఢిల్లీ: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్),  నేషనల్‌ సేవింగ్‌ స్కీం,  కిసాన్ వికాస పత్ర (కేవీపీ) వడ్డీరేట్లను మరోసారి ప్రభుత్వం కోత పెట్టింది.  పీపీఎఫ్, కేవీపీ, సీనియర్ సిటిజన్ డిపాజిట్లు, బాలికా పొదుపు పథకం- సుకన్యా సమృద్ధి యోజనసహా పలు చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీరేట్లపై10 బేసిస్‌ పాయిం‍ట్లను తగ్గించినట్టు  కేంద్రం ప్రకటించింది. సీనియర్ సిటిజన్  సేవింగ్‌ పథకం,  సుకన్యా సమృద్ధి యోజన సహా పలు చిన్న మొత్తాల పొదుపు పథకాలపై కూడా వడ్డీరేట్లు తగ్గుతున్నాయి

తాజా నిర్ణయం ప్రకారం పీపీఎఫ్‌ , ఎన్‌ఎస్‌సీ పథకాలపై 7.8శాతం, కేవీపీపై 7.5శాతంగా ఉండనుంది.  సీనియర్ సిటిజన్  సేవింగ్‌ పథకం, సుకన్యా సమృద్ధి పథకాలపై 8.3 శాతం వడ్డీరేటు వర్తించనుంది. ఇప్పటివరకూ ఇది 8.4శాతంగా ఉంది.  మూడు నెలలకోసారి మార్కెట్ రేటుకు అనుగుణంగా చిన్న పొదుపు రేట్లను సవరించాలన్న కేంద్ర నిర్ణయం నేపథ్యంలో  ఆయా పొదుపు పథకాలపై  వడ్డీరేటు10 బేసిస్‌ పాయింట్ల కోతపెట్టింది.  ఈ వడ్డీ రేట్లకు ప్రాతిపదికగా అంతకు ముదు మూడు నెలల ప్రభుత్వ బాండ్ల రేటును తీసుకుంటారు. ఆర్థికాభివృద్ధికి దోహద పడేలా వ్యవస్థను తక్కువ స్థాయి వడ్డీరేటులోకి మార్చాలన్న కేంద్రం లక్ష్యంలో భాగంగా తాజా  నిర్ణయం. గత  మార్చి నెల సమీక్షలో కూడా 10  బేసిస్‌ పాయింట్లను తగ్గించింది.

 

మరిన్ని వార్తలు