కోవిడ్‌-19 రిలీఫ్‌ : పన్ను రిఫండ్ల చెల్లింపు

8 Apr, 2020 19:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో వ్యక్తులు, సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రమంలో ఆయా వ్యాపార సంస్థలు, వ్యక్తులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పన్ను రిఫండ్లను తక్షణమే చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ 5 లక్షల వరకూ పెండింగ్‌లో ఉన్న అన్ని ఐటీ రిఫండ్స్‌ను తక్షణమే చెల్లించాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది.

ఈ నిర్ణయంతో 14 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఇక జీఎస్టీ, కస్టమ్‌ రిఫండ్స్‌నూ తక్షణం చెల్లించాలని నిర్ణయించడంతో చిన్నమధ్యతరహా సంస్ధలు సహా దాదాపు లక్ష వాణిజ్య సంస్థలు లబ్ధి పొందనున్నాయి.రూ 18,000 కోట్ల పన్ను రిఫండ్లను ప్రభుత్వం పరిష్కరించనుంది.

చదవండి : లాక్‌డౌన్‌ టైమ్‌ : చిన్నారులనూ వేధిస్తున్నారు

మరిన్ని వార్తలు