కరోనా నివారణకు డిజిటల్‌ చెల్లింపులు

19 Mar, 2020 11:10 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను నివారించడానికి అన్ని దేశాలు కీలక చర్యలు తీసుకుంటున్నాయి. దేశంలో నోట్ల చెలామణి వల్ల కరోనా వ్యాప్తి ఎక్కువగా జరిగే అవకాశముందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలో డిజిటల్‌ చెల్లింపుల వైపు ప్రజలను ప్రోత్సహించాలని బ్యాంక్‌లకు సూచించింది. ఈ సందర్భంగా నోట్ల వాడకం తగ్గించాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం.. కరోనా వైరస్‌ నివారణకు డిజిటల్‌ చెల్లింపుల ఆవశ్యతను మీడియా, సోషల్‌ మీడియా, ఈమెయిల్‌, ఎస్‌ఎమ్‌ఎస్‌ రూపంలో ప్రజలకు వివరించాలని బ్యాంక్‌లను ఆదేశించింది. 

ప్రజలకు డిజిటల్‌ చెల్లింపులపై అవగాహన కలిగించేందుకు బ్యానర్లు, పోస్టర్లు, ఔట్‌లెట్లు ఉపయోగించాలని నోటిఫికేషన్‌లో తెలిపారు.  ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా బ్యాంక్‌లను శుభ్రంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా నగదు లావాదేవీలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే డిజిటల్ చెల్లింపులపై ప్రజల్లో అవగాహన కోసం టీవీ చానల్స్, వెబ్ సైట్, టోల్‌ఫ్రీ నెంబర్‌ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు