ఇన్‌ఫ్రా అభివృద్ధిపై కేంద్రం దృష్టి

26 May, 2020 03:48 IST|Sakshi
కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌

ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌

న్యూఢిల్లీ: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కేంద్రం మరింతగా దృష్టి పెట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థపై ఇవి బహుళ విధాలుగా సానుకూల ప్రభావాలు చూపగలవని ఆయన వివరించారు. భారత్‌ స్వయం సమృద్ధమైన దేశంగా తీర్చిదిద్దుకోవాలంటే ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చినట్లుగా ప్రపంచ స్థాయి ఇన్‌ఫ్రాను నిర్మించుకోవడం కీలకమని ఠాకూర్‌ వివరించారు. మౌలిక సదుపాయాలు మెరుగుపర్చేందుకు, పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించేందుకు వచ్చే అయిదేళ్లలో ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు రూ. 111 లక్షల కోట్ల మేర పెట్టుబడులు అవసరమంటూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ గత నెలలో అంచనా వేసింది. ఈ నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మరిన్ని వార్తలు