వంటనూనెలపై దిగుమతి సుంకం భారీ పెంపు

18 Nov, 2017 12:12 IST|Sakshi


సాక్షి, న్యూఢిల్లీ: పెరుగుతున‍్న వంట నూనెల​ ధరలనుకట్టడి చేసే  ప్రయత్నాల్లో భాగంగా  కేంద్ర  ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వంటనూనెల దిగుమతులను కట్టడి చేసేందుకు  చర్యలు తీసుకుంది. ఎడిబుల్‌ ఆయిల్స్‌పై దిగుమతి సుంకాన్ని 15 శాతంగా  ప్రకటించింది

స్థానిక రైతులకు మద్దతు ఇచ్చే ప్రయత్నంలో వంట నూనెలపై దిగుమతి సుంకాలను పెంచింది. క్రూడ్‌ పామ్‌ ఆయిల్‌ఫై ఇంపోర్ట్‌ టాక్స్‌ను 30శాతానికి పెంచింది. ఇప్పటిదాకా ఇది 17.5 శాతంగా  ఉంది.  శుద్ధి చేసిన పామాయిల్‌పై  దీన్ని 40 శాతంగా నిర్ణయించింది.  ఇది గతంలో 25 శాతంగా ఉంది.

కాగా  ప్రపంచంలోనే వంట నూనె అతిపెద్ద దిగుమతిగా  భారత్‌ ఉంది.  పామాయిల్ దిగుమతుల్లో అత్యధిక భాగం  ఇండోనేషియా, మలేషియా దేశాలది   సోయా ఆయిల్ ఎక్కువగా అర్జెంటీనా , బ్రెజిల్ నుంచి దిగుమతి అవుతుంది.
 

మరిన్ని వార్తలు