కంపెనీల చట్టానికి సవరణలపై నోటిఫికేషన్

28 May, 2015 01:26 IST|Sakshi
కంపెనీల చట్టానికి సవరణలపై నోటిఫికేషన్

న్యూఢిల్లీ: వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసేందుకు, మోసాల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించేందుకు ఉద్దేశించి కొత్త కంపెనీల చట్టం 2013లో పలు సవరణలను కేంద్రం నోటిఫై చేసింది. బోర్డుల తీర్మానాలు, అన్‌క్లెయిమ్డ్ డివిడెండ్ల వినియోగం, సంస్థల ఏర్పాటు తదితర సవరణలు ఇందులో ఉన్నాయి. ప్రైవేట్ కంపెనీ ఏర్పాటు కోసం కనీస మూలధనం రూ. 1 లక్ష, ప్రభుత్వ రంగ సంస్థ ఏర్పాటుకు రూ. 5 లక్షలు ఉండాలన్న నిబంధనను కొత్త కంపెనీల చట్టం తొలగించింది.

సమీకరించిన డిపాజిట్లను, వాటిపై వడ్డీని గడువులోగా చెల్లించని కంపెనీలపై రూ. 1 కోటి నుంచి రూ. 10 కోట్ల దాకా జరిమానా పడనుంది. అలాగే, కంపెనీ అధికారులకు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు