ఇండిగో కొత్త బాదుడు : మంత్రిత్వ శాఖ స్పందన 

26 Nov, 2018 14:33 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: విమానయాన సంస్థ  ఇండిగో ప్రయాణికులపై భారీ వడ్డింపునకు సిద్ధమైంది. విమానాశ్రయాల్లో భారీ క్యూలను  తగ్గించేందుకు, సమయాన్ని ఆదా చేసేందుకుద్దేశించిన  వెబ్‌ చెక్‌ ఇన్‌ అవకాశంపై  భారీగా చార్జీలను వసూలు చేయనుంది.  వెబ్‌ చెక్‌ఇన్‌ చేసుకునే అన్నిఅన్ని విమాన టికెట్లపై చార్జీ ఉంటుందని ఇండిగో  ప్రయాణికుడికి సమాధానంగా ట్విటర్‌లో వెల్లడించింది.  ప్రయాణికుడు ఎంచుకున్న సీటు ఆధారంగా ఈ ఫీజు 200-1000 రూపాయల దా​కా ఉండనుంది.  సవరించిన తమ కొత్త విధానం  ప్రకారం ఈ చార్జి చెల్లించాల్సి ఉంటుందనీ, అయితే ఎయిర్‌పోర్ట్‌ ఈ సదుపాయం ఉచితమేనని స్పష్టం చేసింది. దీనిపై ప్రయాణికులు మండిపడుతున్నారు. 

మరోవైపు ఈ పరిణామంపై విమానయాన శాఖ స్పందించింది. ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సీనియర్‌ అధికారి  తెలిపారు. ఈ కొత్త మార్పు నిబంధనలకు అనుగుణంగా ఉందా లేదా అనేది సమీక్షించనున్నామని ఏవియేషన్‌ కార్యదర్శి ఆర్‌ ఎన్ చౌబే వెల్లడించారు. 


కాగా ఇండిగో, జెట్‌ ఎయిర్‌వేస్‌, కొన్ని సీట్లపై మాత్రమే వెబ్‌ చెక్‌ ఇన్‌  ఫీజును వస్తూలు  చేస్తుండగా, స్పైస్‌జెట్‌ అన్నిటికీ చేస్తుంది. అలాగే విస్తారా ఎయిర్‌లైన్స్‌ లోవెబ్‌ చెక్‌ ఇన్‌ పూర్తిగా ఉచితం. 

వెబ్‌ చెక్ ఇన్: దేశీయంగా విమాన టికెట్‌ను బుక్‌ చేసుకున్న ప్రయాణికులు ఆన్‌లైన్‌లోనే వివరాల పరిశీలనతోపాటు, బోర్డింగ్‌ పాస్‌ను కూడా ఈ వెబ్‌ చెక్‌ఇన్‌ ద్వారా పొందవచ్చు. 

మరిన్ని వార్తలు