విమాన ప్రయాణికులకు త్వరలో గుడ్‌న్యూస్‌

28 Nov, 2017 11:14 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : విమాన ప్రయాణికులకు త్వరలోనే విమానయాన సంస్థలు గుడ్‌న్యూస్‌ చెప్పనున్నాయి. ప్రయాణికులపై ఇప్పటి వరకు విధిస్తున్న అత్యధిక రద్దు ఛార్జీలు ఇక నుంచి తగ్గబోతున్నాయి. ప్రస్తుతం కొన్ని విమానయాన సంస్థలు దేశీయ టిక్కెట్ల రద్దుపై రూ.3000 వరకు ఛార్జీలు విధిస్తున్నాయి. ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం భావించింది. అ‍త్యధిక మొత్తంలో విధిస్తున్న ఛార్జీలపై తగ్గాలంటూ విమానయాన సంస్థలను కేంద్రం కోరబోతుంది. సహేతుకమైన మొత్తానికి ఈ ఫీజుల తగ్గింపు ఉండేలా ప్రభుత్వం ఎయిర్‌లైన్స్‌తో  చర్చలు జరుపబోతున్నట్టు సమాచారం. 

''రద్దు ఛార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయని మేము భావిస్తున్నాం. రూ.3000 ఛార్జీ చాలా కేసుల్లో టిక్కెట్‌ కన్నా ఎక్కువగా ఉంది. తమ ఉడాన్‌ స్కీమ్‌ కిందనే గంట ప్రయాణానికి రూ.2500 ఛార్జీ ఉంది'' అని ఏవియేషన్‌ మంత్రి జయంత్‌ సిన్హా తెలిపారు. ఎక్కువ మొత్తంలో రద్దు ఛార్జీల వల్ల ముందస్తుగా తక్కువ ధరకు టిక్కెట్లు కొనడాన్ని నిరోధిస్తుందని ట్రావెల్‌ నిపుణులు చెబుతున్నారు. తక్కువ ధరకు ముందస్తుగా టిక్కెట్‌ కొనుగోలు చేసిన తర్వాత అనుకోని కారణాల వల్ల టిక్కెట్‌ను క్యాన్సిల్‌ చేసుకోవాల్సి వస్తే, రద్దు ఛార్జీలు అత్యధిక మొత్తంలో ఉంటున్నట్టు తేలింది. దీంతో కొనుగోలుదారులు ముందస్తుగా టిక్కెట్లు కొనుగోలు చేయడాన్ని వాయిదా వేస్తున్నారని ట్రావెల్‌ ఏజెంట్‌ తెలిపారు. ఒక్క రద్దు ఛార్జీలను మాత్రమే కాక, చెక్‌-ఇన్‌-బ్యాగేజీ వంటి పలు ఛార్జీలను కూడా విమానయాన సంస్థలు పెంచుతున్నాయి.

మరిన్ని వార్తలు