ఆ కార్లు ఇక కొనలేరు...

23 Aug, 2017 13:25 IST|Sakshi
ఆ కార్లు ఇక కొనలేరు...

సాక్షి, న్యూఢిల్లీ : లగ్జరీ, ఎస్‌యూవీ కార్లు ఇక భారం కానున్నాయి. వీటిపై ఇప్పుడు విధిస్తున్న 15 శాతం సెస్‌ను జీఎస్‌టీ కింద 25 శాతానికి పెంచనున్నారు. సెస్‌ను పెంచేందుకు ఇటీవల జీఎస్‌టీ కౌన్సిల్‌ అంగీకరిచడంతో పెంపు ఆర్డినెన్స్‌కు కేం‍ద్ర క్యాబినెట్‌ బుధవారం ఆమోద ముద్ర వేయనుంది.ఈ దిశగా ఇటీవల పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ఈ సవరణను చేపట్టకపోవడంతో ప్రభుత్వం ఆర్డినెన్స్‌ ద్వారా చట్టంలో మార్పులకు మొగ్గుచూపింది.

జీఎస్‌టీ అమలుతో నష్టపోయే రాష్ట్రాలకు పరిహారం చెల్లించేలా లగ్జరీ వస్తువులపై సెస్‌ విధించేందుకు కేంద్రం జీఎస్‌టీ (ఆదాయ నష్టం జరిగే రాష్ట్రాలకు పరిహారం) ప్రత్యేక బిల్లును తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే సెస్‌ పెంపుపై ఆటోమొబైల్‌ కంపెనీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. సెస్‌ పెంచితే తాము వాహనాల ధరలను పెంచాల్సివస్తుందని ఇది కస్టమర్లపై భారం మోపినట్టవుతుందని వాపోతున్నాయి. సెస్‌ పెరిగితే లగ్జరీ వాహనాల ధరలు పెరిగి అమ్మకాలు తగ్గుతాయని కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి.

మరిన్ని వార్తలు