మొబైల్‌ కనెక్షన్లకు ఆధార్‌ ఈ–కేవైసీ వాడొద్దు

27 Oct, 2018 01:43 IST|Sakshi

టెల్కోలకు కేంద్రం ఆదేశాలు

న్యూఢిల్లీ: పాత, కొత్త మొబైల్‌ కనెక్షన్లకు సంబంధించి ఎలక్ట్రానిక్‌ విధానంలో యూజర్ల గుర్తింపు, చిరునామాల ధృవీకరణ కోసం (ఈ–కేవైసీ) ఆధార్‌ను ఉపయోగించరాదంటూ టెలికం సంస్థలను కేంద్రం ఆదేశించింది. వినియోగదారు స్వచ్ఛందంగా ఇచ్చిన పక్షంలో కేవైసీ కోసం పేపరు రూపంలోని ఆధార్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చని సూచించింది. ఈ నిబంధనల అమలుపై నవంబర్‌ 5లోగా నివేదిక ఇవ్వాలని టెలికం శాఖ శుక్రవారం ఒక సర్క్యులర్‌లో పేర్కొంది. ప్రైవేట్‌ సంస్థలు ఆధార్‌ను వినియోగించడంపై ఆంక్షలు విధిస్తూ సుప్రీం కోర్టు తాజా తీర్పు నేపథ్యంలో టెలికం శాఖ తాజా నిర్ణయం తీసుకుంది.  

మరిన్ని వార్తలు