వారికి ఊరట : దిగుమతి సుంకం రెట్టింపు

7 Aug, 2018 16:51 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ వస్త్ర ఉత్పత్తులకు, ఉత్పత్తిదారులు, ఊరట నిచ్చేలా కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  టెక్స్‌టైల్‌ ఉత్పత్తులపై  దిగుమతి సుంకాన్ని రెట్టింపు  చేసింది. భారీ సంఖ్యలో ఈ  ఉత్పత్తులపై 20 శాతం  దిగుమతి సుంకం విధించింది.  ఈ మేరకు ఒక  నోటిఫికేషన్‌ను మంగళవారం ప్రభుత్వం లోక్‌సభకు సమర్పించింది.

328 రకాల వస్త్ర ఉత్పత్తులపై 20 శాతం  పన్ను విధిస్తున్నట్టు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పోన్ రాధాకృష్ణన్ లోకసభకు చెప్పారు. దిగుమతి చేసుకునే వస్త్ర ఉత్పత్తులపై ప్రస్తుతం  పన్ను తక్కువగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కస్టమ్స్‌ యాక్ట్‌ (1962) సెక్షన్‌ 159 ప్రకారం రెట్టింపునకు నిర్ణయించినట్టు తెలిపారు. తద్వారా దేశీయ తయారీదారులకు  మంచి  ప్రోత్సాహం లభించడంతోపాటు, ఈ రంగంలో భారీగా ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు.  అయితే దిగుమతి చేసుకున్న వస్త్రాల ధరలుమాత్రం మోత మోగనున్నాయి.  అలాగే కేంద్రం నిర్ణయంబ చైనా ఉత్పత్తులనే    ఎక్కువగా  ప్రభావితం చేయనుందని ఎనలిస్టులు భావిస్తున్నారు.  కాగా గత నెలలో ప్రభుత్వం 50రకాల వస్త్రాల ఉత్పత్తులపై దిగుమతి సుంకం రెండింతలు చేసింది.  జాకెట్లు, సూట్లు,  కార్పెట్లపై 20 శాతం  దిగుమతి సుంకం విధించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు