సకాలంలో చెల్లిస్తేనే 4 శాతం...లేదంటే

15 Jun, 2017 14:24 IST|Sakshi

న్యూఢిల్లీ:  ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన  క్యాబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. బుధవారం నాటి కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ముఖ్యంగా  రైతుల‌కిచ్చే పంట‌రుణాల కోసం  ఈ కొత్త ప‌థ‌కాన్ని  ప్రకటించింది.  ఇంట్రెస్ట్ స‌బ్‌వెన్షన్‌  స్కీమ్ అనే ప‌థ‌కం కింద  స్వల్పకాలిక ‌(సం.రం లోపు)రుణాల‌పై కేవ‌లం నాలుగు శాతం వ‌డ్డీని వ‌సూలు చేయ‌నునున్నట్టు  కేంద్రం ప్రకటించింది.  అయితే 3 లక్షల రూపాయల స్వల్పకాలిక పంట రుణాన్ని  సకాలంలో  చెల్లించిన రైతులకు  మాత్రమే 4 శాతం వడ్డీ రేటుతో అందుబాటులో ఉంచడం కొనసాగుతుందని తెలిపింది.  

2017-18 సంవత్సరం కోసం ఈ కొత్త  త‌ర‌హా స్కీమ్‌ను ప్రవేశపెట్టనుంది.  ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి రూ. 20,339 కోట్ల ఖర్చుతో స్వల్పకాలిక పంట రుణాలకు వడ్డీ సబ్సిడీగా కేబినెట్ ఆమోదం తెలిపిందని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఈ పథకం కింద సంవత్సరానికి 2 శాతం స‌బ్‌వెన్షన్‌తో  చిన్న వ్యవసాయ రుణదాతకు 3,00,000 రైతులకు అందివ్వబడుతుందని చెప్పారు.   మూడులక్షల లోపుతీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించిన రైతులకు మాత్రమే  4శాతం  వడ్డీ రేటు అమలు చేయనున్నామన్నారు. లేదంటే 7శాతం  వడ్డీ రేటు కొనసాగనుందని పేర్కొన్నారు.

ఏడాది పాటు కొనసాగే ఇంట్రెస్ట్ స‌బ్‌వెన్షన్‌ స్కీమ్‌ను   నాబార్డ్‌, ఆర్బీఐలు ఈ ప‌థ‌కాన్ని అమ‌లు  చేస్తాయి. ప్రైవేటు, కార్పొరేటివ్‌, రీజిన‌ల్ బ్యాంకుల‌ ద్వారా రైతుల‌కు నిధులను అందిచ‌నున్నారు. వ్యవసాయ రుణాలు క్షేత్ర స్థాయిలో రైతుల‌కు అందాల‌న్న ఉద్దేశంతోనే ఈ స్కీమ్‌ను అమలు  చేయనున్నారు.  అలాగే 2017-18 నాటికి, వ్యవసాయ రుణ లక్ష్యాన్ని 10 లక్షల కోట్ల రూపాయలకు పెంచారు. 2016-17లో ఇది రూ. 9 లక్షల కోట్లుగా ఉంది. దేశంలోని  పలు ప్రాంతాల్లో   రైతుల ఆందోళనలు మిన్నంటడడంతో రుణమాఫీ ప్రకటించిన  ముఖ్యంగా మధ్య ప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్రల్లో  కూడా వర్తించనుంది.
 

మరిన్ని వార్తలు