త్వరలో గోల్డ్‌ పాలసీ

1 Feb, 2018 16:10 IST|Sakshi

సాక్షి, న్యూడిల్లీ: బంగారాన్ని అసెట్ క్లాస్‌గా అభివృద్ధి చేయాలనే  దిశగా ఆలోచిస్తున్నామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ గురువారం నాటి బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. బంగారాన్ని ఒక ఆస్తిగా పరిగణించేందుకు ఒక గోల్డ్ పాలసీకి త్వరలోనే రూపకల్పన చేయనున్నామని ప్రకటించారు.

గోల్డ్ మానిటైజేషన్ పథకం గురించి  మాట్లాడుతూ అసెట్‌ క్లాస్‌గా  విలువైన లోహం బంగారాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం  ఒక సమగ్ర గోల్డ్ పాలసీని  తీసుకురానుందని అరుణ్ జైట్లీ  తెలిపారు. పరిశ్రమలో ప్రామాణిక నిబంధనలను నెలకొల్పడానికి దీర్ఘకాలిక గోల్డ్ పాలసీని రూపొందించాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. తద్వారా  ప్రజలకు అవాంతర రహిత గోల్డ్ డిపాజిట్ ఖాతా తెరవడానికి వీలు కల్పించనున్నట్టు ఆయన పునరుద్ఘాటించారు.
 

>
మరిన్ని వార్తలు