బంగారం దిగుమతుల టారిఫ్ పెంపు

1 Nov, 2016 00:31 IST|Sakshi
బంగారం దిగుమతుల టారిఫ్ పెంపు

 న్యూఢిల్లీ: పసిడి దిగుమతుల టారిఫ్‌ను ప్రభుత్వం సోమవారం పెంచింది. 10 గ్రాములకు ప్రస్తుత టారిఫ్ 410 డాలర్ల నుంచి 414 డాలర్లకు పెరిగింది. ఇక వెండి టారిఫ్‌ను సైతం కేజీకి 576 డాలర్ల నుంచి 577 డాలర్లకు ఎగసింది. ధరలో ఎటువంటి అవకతవకలూ లేకుండా  కస్టమ్స్ సుంకం విధించడానికి బేస్ ధరగా టారిఫ్ రేటు ఉంటుంది. పసిడిపై విధించే దిగుమతి సుంకానికి బేస్‌గా ఇప్పటివరకూ 410 డాలర్లను తీసుకొంటుండగా, వచ్చే 15 రోజులకూ 414 డాలర్ల బేస్‌తో సుంకాన్ని విధిస్తారు. అంతర్జాతీయ ధరకు అనుగుణంగా సాధారణంగా పక్షం రోజులకు ఒకసారి ఈ ధర నిర్ణయం ఉంటుంది.
 

మరిన్ని వార్తలు