ఎన్ఎండీసీ వాటా విక్రయానికి మర్చంట్ బ్యాంకర్లు

23 Apr, 2016 00:51 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎన్‌ఎండీసీ వాటా విక్రయానికి మర్చంట్ బ్యాంకర్లుగా వ్యవహరించడానికి ఆర్థిక సంస్థల నుంచి బిడ్‌లను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆహ్వానించింది. ఎన్‌ఎండీసీలో 10 శాతం వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.3,900 కోట్లు వస్తాయని అంచనా. ఈ 10 శాతం వాటాను ఆఫర్ ఫర్ సేల్ విధానంలో విక్రయించనున్నారు. ఈ వాటా విక్రయం కోసం మర్చంట్ బ్యాంకర్లుగా వ్యవహరించడానికి నాలుగు సంస్థలను ప్రభుత్వం ఎంపిక చేయనున్నది. ఆర్థిక సంస్థలు వచ్చే నెల 16లోగా తమ బిడ్‌లను సమర్పించాలని దీపం పేర్కొంది.

మరిన్ని వార్తలు