బీపీసీఎల్‌ విక్రయం:  బిడ్డింగ్‌లకు ఆహ్వానం

7 Mar, 2020 14:26 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారతదేశపు రెండవ అతిపెద్ద చమురు శుద్ధిదారు భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌)ను ప్రైవేటీకరణలో సంస్థలో సగానికిపైగా వాటాల విక్రయానికి కేంద్రం శనివారం బిడ్డింగ్‌లను ఆహ్వానించింది. మొత్తం 52.98 శాతం వాటాను విక్రయించడానికి బిడ్లను ఆహ్వానిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. పెట్టుబడి, పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ విభాగం (డిపామ్)  బిడ్‌నోట్‌ ప్రకారం  బీపీసీఎల్‌ వ్యూహాత్మక అమ్మకం కోసం ఆసక్తి గల వారు మే 2వ తేదీలోగా  తమ బిడ్డింగ్‌లను  సమర్పించాల్సి వుంటుంది.

భారత ప్రభుత్వం 114.91 కోట్ల (52.98శాతం ఈక్విటీ వాటా)ఈక్విటీ షేర్లతో కూడిన బీపీసీఎల్‌ మొత్తం వాటాను వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టాలని ప్రతిపాదిస్తోంది. తద్వారా  బీపీసీఎల్‌ ఈక్విటీ వాటా 61.65 శాతం వాటా వున్న ఎన్‌ఆర్‌ఎల్‌ తప్ప,  మిగిలిన నిర్వహణ నియంత్రణ వ్యూహాత్మక కొనుగోలుదారుకు బదిలీ అవుతుందని తెలిపింది. బిడ్డింగ్ రెండు దశల్లో వుంది మొదటి దశలో ఆసక్తి వ్యక్తీకరణ ఆసక్తి, అనంతరం రెండవ రౌండ్లో ఫైనాన్స్‌ బిడ్డింగ్‌ ఉంటుంది.  ప్రభుత్వ రంగ సంస్థలకు  ఈ బిడ్డింగ్‌లో పాల్గొనే అవకాశం లేదు. 10 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్ ఉన్న ఏ ప్రైవేట్ సంస్థ అయినా బిడ్డింగ్‌కు అర్హులు . అలాగే నాలుగు సంస్థలకు మించని కన్సార్షియానికి అనుమతి వుండదు. బిడ్డింగ్ ప్రమాణాల ప్రకారం, కన్సార్టియం లీడర్‌ 40శాతం వాటాను కలిగి ఉండాలి. ఇతరులు కనీసం ఒక బిలియన్ డాలర్ల నెట్‌వర్త్ కలిగి ఉండాలి. 45 రోజుల్లో కన్సార్షియంల మార్పులు అనుమతించబడతాయి. కానీ కన్సార్షియానికి నేతృత్వం వహించే సంస్థను మార్చడానికి వీల్లేదు. కాగా మందగమనంలో ఉన్న ఆర్థికవ్యవస్థను ఆదుకునేందుకు రూ.లక్ష కోట్లు సమీకరించే లక్ష్యంగా  భాగంగా ఎయిరిండియా, బీపీసీఎల్‌ ప్రైవేటీకరణకు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి విదితమే.

>
మరిన్ని వార్తలు