బీవోబీ చీఫ్‌ పదవీకాలం పొడిగించే అవకాశం

3 Sep, 2018 01:54 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ) ఎండీ, సీఈవో పీఎస్‌ జయకుమార్‌ పదవీకాలాన్ని కేంద్రం పొడిగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆయన మూడేళ్ల పనితీరును మదింపు చేసిన అనంతరం ఈమేరకు తుది నిర్ణయం తీసుకోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌లుగా ప్రైవేట్‌ రంగం నుంచి ప్రత్యేకంగా ఎంపిక చేసిన ఇద్దరు ప్రొఫెషనల్స్‌లో జయకుమార్‌ కూడా ఒకరు. 2015 అక్టోబర్‌లో బీవోబీ సీఈఓగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఆయన మూడేళ్ల పదవీకాలం అక్టోబర్‌ 12తో ముగియనుంది. జయకుమార్‌ బాధ్యతలు చేపట్టాక 11 త్రైమాసికాల్లో బీవోబీ నికరంగా రూ. 7,092 కోట్ల నష్టాల్ని ప్రకటించింది.   

మరిన్ని వార్తలు