ఎన్‌బీఎఫ్‌సీలకు బాసట..

6 Jul, 2019 02:35 IST|Sakshi

అసెట్స్‌ కొనుగోలు చేసే పీఎస్‌బీలకు పాక్షిక రుణ హామీ

ఆర్‌బీఐకి మరిన్ని నియంత్రణాధికారాల ప్రతిపాదనలు

న్యూఢిల్లీ: నిధుల సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలకు (ఎన్‌బీఎఫ్‌సీ) కొంత ఊరటనిచ్చే దిశగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌  బడ్జెట్లో ప్రతిపాదనలు చేశారు. ఆర్థికంగా పటిష్టంగా ఉన్న ఎన్‌బీఎఫ్‌సీల నుంచి అత్యుత్తమ రేటింగ్‌ ఉన్న అసెట్స్‌ను ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) కొనుగోలు చేస్తే కేంద్రం వన్‌టైమ్‌ పాక్షిక రుణ హామీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 1 లక్ష కోట్ల మేర విలువ చేసే ఎన్‌బీఎఫ్‌సీల అసెట్స్‌ కొనుగోలు చేసే ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం వన్‌టైమ్‌ ప్రాతిపదికన పాక్షికంగా హామీనిస్తుంది.

ఒకవేళ నష్టం వాటిల్లితే 10 శాతం దాకా హామీ ఉంటుంది‘ అని మంత్రి తెలిపారు. వినియోగ డిమాండ్‌ను నిలకడగా కొనసాగించడంలోనూ, చిన్న..మధ్య తరహా పరిశ్రమలకు అవసరమైన మూలధనం సమకూర్చడంలోను ఎన్‌ బీఎఫ్‌సీలు కీలకపాత్ర పోషిస్తున్నాయని ఆమె చెప్పారు. గతేడాది సెప్టెంబర్‌లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ కంపెనీలు డిఫాల్టు అయినప్పట్నుంచీ ఎన్‌బీఎఫ్‌సీలకు కష్టాలు మొదలైన సంగతి తెలిసిందే.  
ఇక ప్రస్తుతం ఎన్‌బీఎఫ్‌సీలు రిజర్వ్‌ బ్యాంక్‌ నియంత్రణలో ఉంటున్నాయి. అయినప్పటికీ వాటి నియంత్రణ విషయంలో ఆర్‌బీఐకి  పరిమిత స్థాయిలోనే అధికారాలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్‌ బీఎఫ్‌సీలను ఆర్‌బీఐ మరింత పటిష్టంగా నియంత్రించే విధంగా ఫైనాన్స్‌ బిల్లులో మరిన్ని చర్యలుంటాయని సీతారామన్‌  తెలిపారు.

డీఆర్‌ఆర్‌ తొలగింపు..
పబ్లిక్‌ ఇష్యూల ద్వారా ఎన్‌బీఎఫ్‌సీలు నిధుల సమీకరణకు సంబంధించి డిబెంచర్‌ రిడెంప్షన్‌ రిజర్వ్‌ (డీఆర్‌ఆర్‌) నిబంధనను ఎత్తివేస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌  తెలిపారు. ప్రస్తుతం డెట్‌ పబ్లిక్‌ ప్లేస్‌మెంట్‌ ద్వారా నిధులు సమీకరించే ఎన్‌బీఎఫ్‌సీలు డీఆర్‌ఆర్‌ కింద కొంత మొత్తాన్ని పక్కన పెట్టడంతో పాటు ఆర్‌బీఐ నిబంధనలకు అనుగుణంగా స్పెషల్‌ రిజర్వ్‌ కింద మరికాస్త పక్కన పెట్టాల్సి ఉంటోంది. మరోవైపు, గృహ రుణాల రంగంపై నియంత్రణాధికారాలను ఎన్‌హెచ్‌బీ నుంచి ఆర్‌బీఐకి బదలాయించాలని ప్రతిపాదిస్తున్నట్లు ఆమె వివరించారు. పెన్షను రంగ నియంత్రణ సంస్థ పీఎఫ్‌ఆర్‌డీఏ నుంచి నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (ఎన్‌పీఎస్‌) ట్రస్టును విడదీయనున్నట్లు తెలిపారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫేస్‌ స్లిమ్మింగ్‌ ఫీచర్‌తో ఒప్పో ఏ9

మరో కుంభకోణం : షేర్లు ఢమాల్‌

నిజామాబాద్‌లో వాల్‌మార్ట్‌ ప్రారంభం

ఇంటెలిజెంట్‌ వెహికల్స్‌ రయ్‌!

ఎలక్ట్రిక్‌ వాహన బ్యాటరీలు... తెలంగాణకు 3 కంపెనీలు

ఈబిక్స్‌ చేతికి యాత్రా ఆన్‌లైన్‌

భారత్‌కు మాల్యా : బిగ్‌ బ్రేక్‌

భారీగా పతనమైన యస్‌ బ్యాంక్‌ షేరు

నష్టాల్లో సూచీలు : బ్యాంకుల జోరు

హ్యుందాయ్‌ ‘కోనా’ ధర భారీగా తగ్గనుందా?

విప్రో లాభం 2,388 కోట్లు

దిగ్గజ స్టార్టప్‌కు ప్రేమ్‌జీ ఊతం

అజీం ప్రేమ్‌జీ అండతో ఆ స్టార్టప్‌ అరుదైన ఘనత

కార్పొరేట్‌ బ్రదర్స్‌ : అనిల్‌ అంబానీకి భారీ ఊరట

లాభాల్లోకి మార్కెట్లు : బ్యాంక్స్‌ జూమ్‌

రెడ్‌మి కే 20 ప్రొ వచ్చేసింది

రెడ్‌మి కే20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ : బిగ్‌ సర్‌ప్రైజ్‌

స్వల్ప లాభాలతో స్టాక్‌మార్కెట్లు

మార్కెట్లోకి ‘స్కోడా రాపిడ్‌’ లిమిటెడ్‌ ఎడిషన్‌

‘ఐటీఆర్‌ ఫామ్స్‌’లో మార్పుల్లేవ్‌..

ఇక ‘స్మార్ట్‌’ మహీంద్రా!

సు‘జలం’ @ 18.9 లక్షల కోట్లు!

విప్రోకు ఉజ్వల భవిష్యత్‌: ప్రేమ్‌జీ

ప్రైమ్‌ డే సేల్ ‌: అమెజాన్‌కు షాక్‌

నేటి నుంచీ కియా ‘సెల్టోస్‌’ బుకింగ్స్‌ ప్రారంభం

ఎక్కడైనా వైఫై కనెక్టివిటీ !

అశోక్‌ లేలాండ్‌ ప్లాంట్‌ తాత్కాలిక మూసివేత

కొనుగోళ్ల జోష్‌ : లాభాల్లోకి సూచీలు 

ఎయిరిండియాకు భారీ ఊరట

ఫ్లాట్‌గా స్టాక్‌మార్కెట్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నాగార్జున ఇంటి వద్ద పోలీసు బందోబస్తు

మూడోసారి తండ్రి అయిన హీరో!

చానల్ స్టార్ట్ చేసిన మహేష్ బాబు కూతురు

లిప్ లాక్‌పై స్పందించిన విజయ్‌ దేవరకొండ

తిడతావేంటమ్మా.. నువ్వేం మారలేదు!

నమ్మకముంటే ఏదైనా సాధించవచ్చు..