-

ఎన్‌టీపీసీలో 5% డిజిన్వెస్ట్‌మెంట్‌

29 Aug, 2017 00:21 IST|Sakshi
ఎన్‌టీపీసీలో 5% డిజిన్వెస్ట్‌మెంట్‌

రూ. 7000 కోట్ల సమీకరణ
168 ధరతో నేడు ఆఫర్‌ ఫర్‌ సేల్‌


న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విద్యుదుత్పాదక దిగ్గజం ఎన్‌టీపీసీలో కేంద్ర ప్రభుత్వం 5 శాతం వాటాను డిజిన్వెస్ట్‌ చేయనుంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) రూపంలో జరిగే ఈ వాటా విక్రయం ద్వారా రూ. 7,000 కోట్లు ప్రభుత్వం సమీకరిస్తుంది. రూ. 168 ధరతో జరిగే ఓఎఫ్‌ఎస్‌ మంగళ, బుధవారాల్లో అమల్లో వుంటుందని కేంద్ర ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఓఎఫ్‌ఎస్‌ నేపథ్యంలో సోమవారం ఎన్‌టీపీసీ షేరు ధర 2.5 శాతం ఎగిసి రూ. 173.55 వద్ద ముగిసింది. ఓఎఫ్‌ఎస్‌కు తాజా ధరతో పోలిస్తే 3 శాతం డిస్కౌంట్‌తో ఫ్లోర్‌ ధరను నిర్ణయించారు. ఇష్యూ ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయితే మరో 5 శాతం విక్రయించే ఆప్షన్‌తో ఓఎఫ్‌ఎస్‌ జారీచేస్తున్నట్లు ఆ అధికారి వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకూ డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా ప్రభుత్వం రూ. 8,800 కోట్లు సమీకరించగా, పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ. 72,500 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.

మరిన్ని వార్తలు