వారి రుణాలు రద్దు చేయాలి : అభిజిత్ బెనర్జీ

5 May, 2020 15:23 IST|Sakshi

భారీ ఆర్థిక ప్యాకేజీ కావాలి

నిరు పేదలకు నగదు బదిలీ తప్పనిసరిగా ఉండాలి

మహమ్మారి స్వభావాన్ని గుర్తించాలి లాక్‌డౌన్‌ పొడగింపు సహాయపడదు

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా సంక్షోభం, ఆర్థిక మాంద్యంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో ముచ్చటించిన ప్రముఖ ఆర్థిక వేత్త  నోబెల్‌ గ్రహీత అభిజిత్‌ బెనర్జీ మంగళవారం కీలక అభిప్రాయాలను వ్యక్తంచేశారు. మహమ్మారి కారణంగా ప్రభావితమైన వ్యాపారాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే ప్రజల చేతుల్లోకి నగదు చేరాలంటే కేంద్రం భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాల్సి వుందని బెనర్జీ సూచించారు. నిరుపేదలకు నగదు బదిలీ సౌకర్యం  తప్పనిసరిగా ఉండాలని బెనర్జీ అన్నారు. కోవిడ్-19 మహమ్మారి ప్రభుత్వాల ముందు పెద్ద సవాలు విసిరిందని, చాలా మంది ఉద్యోగాలు కోల్పోవచ్చన్న రాహుల్ వ్యాఖ్యాలను అంగీకరించిన ఆయన ఈ సూచన చేశారు. అంతేకాదు వీలైనంత తొందరగా లాక్‌డౌన్‌ నుంచి బయటపడాలన్నారు. కరోనా వైరస్ మహమ్మారి స్వభావం గురించి తెలుసుకోవాలి తప్ప లాక్‌డౌన్‌  పొడగింపు సహాయపడదని పేర్కొన్నారు. (పెట్రో ధరలకు వ్యాట్ షాక్ )

ఆహార కొరత సమస్యపై స్పందించిన ఆయన తాను ఇంతకుముందే ప్రభుత్వానికి సూచించినట్టుగా కనీసం మూడు నెలలు చెల్లుబాటయ్యేలా ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులివ్వాలని బెనర్జీ చెప్పారు. వీటి సాయంతో ఒక్కరికి ప్రస్తుతం బియ్యం, పప్పుధాన్యాలు, గోధుమలు, చక్కెర లాంటి వాటిని ఉచితంగా  అందించాలని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనావైరస్ కాలంలో కేంద్రం కొత్త సంక్షేమ పథకాలను అమలు చేయాలని, రాష్ట్రాలు డైరెక్ట్  బెనిఫిట్ ఫథకాలను అమలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఇండోనేషియా ఉదాహరణను బెనర్జీ ఉదహరించారు. (లాక్‌డౌన్‌ సడలింపు : పసిడి వెలవెల)

కరోనావైరస్ అనంతరం ప్రభుత్వ ప్రణాళిక ఎలా ఉండాలన్న రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బెనర్జీ మాట్లాడుతూ, లాక్‌డౌన్‌  ద్వారా దెబ్బతింటున్న చిన్న, మధ్య వ్యాపారాలు, ఉపాధి మార్గాలపై స్పందించిన ఆయన చిన్న వ్యాపారాల రుణాలను కేంద్రం రైట్ ఆఫ్ చేయాలని పేర్కొన్నారు.  తద్వారా వారిని నిలబెట్టడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు.  దీంతో పాటు గత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని విధానాలను కూడా బెనర్జీ ప్రశంసించారు. గత ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్న అనుభవం గురించి రాహుల్ బెనర్జీని అడిగినపుడు దాని గురించి తాను ఎప్పుడూ ఆలోచించలేదని చెప్పడం విశేషం. (లాక్‌డౌన్‌ పొడిగింపుపై ఇన్ఫీ మూర్తి స్పందన)

కాగా ప్రముఖ ఆర్థిక వేత్త, ఆర్బీఐ మాజీ గవర్నరు రఘురామ్‌ రాజన్‌తో గత వారం ప్రారంభమైన రాహుల్‌ చర్చా సిరీస్‌లో ఇది రెండో భాగం. లాక్‌డౌన్‌తో బాధపడుతున్న పేదలకు సహాయం అందించేందుకు రూ.65వేల కోట్లు అవసరమని రాజన్‌ అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. (270 కోట్ల తప్పుడు ప్రకటనలు తొలగించాం: గూగుల్‌)

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు