17% తగ్గనున్న గ్యాస్ ధరలు

31 Mar, 2016 02:16 IST|Sakshi
17% తగ్గనున్న గ్యాస్ ధరలు

న్యూఢిల్లీ: సహజ వాయువు ధర ఏప్రిల్ 1 నుంచి యూనిట్‌కు (ఎంబీటీయూ) 17 శాతం మేర తగ్గనున్నాయి. 3.82 డాలర్ల నుంచి 3.15 డాలర్లకు దిగి రానున్నాయి. ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 దాకా వర్తించేలా సవరించిన గ్యాస్ రేట్లను ప్రభుత్వం సత్వరం ప్రకటించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.  2014 అక్టోబర్‌లో ఎన్డీయే ప్రభుత్వం ఆమోదించిన నిర్దిష్ట ఫార్ములా ప్రకారం గ్యాస్ ధర ను ప్రతి ఆరు నెలలకోసారి సవరించాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే తాజాగా మార్పులు జరగనున్నాయి.

మరిన్ని వార్తలు