ప్రభుత్వ రంగ బ్యాంకులకు త్వరలో రూ.5,050 కోట్లు

29 Mar, 2016 00:58 IST|Sakshi
ప్రభుత్వ రంగ బ్యాంకులకు త్వరలో రూ.5,050 కోట్లు

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులకు త్వరలో కేంద్రం రూ.5,050 కోట్ల అదనపు మూలధనాన్ని సమకూర్చనుంది.సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, యుకో బ్యాంక్, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, విజయా బ్యాంక్, యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంక్‌లకు తాజా మూలధనం అందే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.25,000 కోట్ల మూలధనం బ్యాంకింగ్‌కు అందించాలన్నది ప్రణాళిక. ఇందులో భాగంగా ఇప్పటికే  కేంద్రం 13 బ్యాంకులకు రూ.19,950 కోట్ల మూలధనం అందించింది.

 సిండికేట్, యుకో బ్యాంక్‌లకు రూ.1,675 కోట్లు: కాగా2015-16  మూలధన ప్రణాళిక కింద  ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన షేర్ల జారీ ద్వారా సిండికేట్ బ్యాంక్, యుకో బ్యాంకులు రూ.1,675 కోట్లు పొందనున్నాయి. షేర్ల జారీ ద్వారా రూ.935 కోట్లు సమీకరించుకోనున్నట్లు యుకో బ్యాంక్ పేర్కొంది.  సిండికేట్ బ్యాంక్ విషయంలో ఈ మొత్తం రూ.740 కోట్లుగా ఉంది.

మరిన్ని వార్తలు