ఎన్‌టీపీసీకి ఓఎఫ్‌ఎస్‌ షాక్‌!

29 Aug, 2017 10:22 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద  ప్రభుత్వరంగ విద్యుత్ ఉత్పత్తిదారు ఎన్‌టీపీసీకి ఓఎఫ్‌ఎస్‌ షాక్‌ తగిలింది. ప్రభుత్వ డిజ్‌ఇన్వెస్ట్‌మెంట్‌  ప్రక్రియ మంగళవారం   ప్రారంభం కానుంది.  షేరుకు  రూ .168 చొప్పున ప్రభుత్వం 7 వేల కోట్ల రూపాయల మేరకు 5 శాతం వాటాను విక్రయిస్తోంది. దీంతో ఎన్‌టీపీఎస్‌ షేరు 3 శాతానికి పైగా క్షీణించింది. ఓఎఫ్‌ఎస్‌కు ప్రభుత్వం నిర్ణయించిన ధర సోమవారం ముగింపు రూ. 173తో  పోలిస్తే 3 శాతం తక్కువ!

ప్రప్రభుత్వ రంగ విద్యుత్‌ దిగ్గజం ఎన్‌టీపీసీలో ప్రభుత్వం 5 శాతం వాటాను విక్రయ ఆఫర్‌ ఫర్‌ సేల్‌  మొదలుకానుంది. షేరుకి రూ. 168 ధరలో 5 శాతం వాటాను విక్రయించడం ద్వారా రూ. 7,000 కోట్లు సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఓవర్-సబ్‌ స్క్రిప్షన్‌  ద్వారా మరో 5 శాతం  సాధించనున్నట్టు ఆ అధికారి తెలిపారు.  కాగా..  రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఈ ఆఫర్‌ బుధవారం ఓపెన్‌ కానుంది.  సంస్థాగత ఇన్వెస్టర్లు    ఈరోజు బిడ్డింగ్‌ చేసుకునే అవకాశం.
 
కాగా  ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ రూ.8,800 కోట్లను సాధించింది. ముఖ‍్యంగా ఎల్ అండ్ టిలో వాటాలు విక్రయం,  యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (ఎస్‌యుటిఐఐ),  ఒక వాటాల పునర్ కొనుగోలు సహా ఆరు కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా  ఈ నిధులను  ఆర్జించింది. ప్రభుత్వ రంగాలలో వాటాల విక్రయాల ద్వారా 2017-18లో  రూ. 72,500 కోట్ల లక్ష్యంగా పెట్టుకుంది.  ఇందులో మైనారిటీ వాటాల విక్రయాల నుండి 46,500 కోట్ల రూపాయలు, పంచవర్ష పెట్టుబడి సంస్థల జాబితా నుండి రూ. 15,000 కోట్లు, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా  రూ. 11,000 కోట్లను సమకూర్చుకోనుంది.
 

మరిన్ని వార్తలు