బడ్జెట్లో పీఎస్‌బీలకు నిధుల కేటాయింపులు ఉండకపోవచ్చు

6 Jan, 2020 05:41 IST|Sakshi

న్యూఢిల్లీ: రానున్న 2020–21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ప్రభుత్వరంగ బ్యాంకులకు (పీఎస్‌బీలు) నిధుల కేటాయింపును ప్రకటించకపోవచ్చని, బదులుగా మొండి బకాయిలు (ఎన్‌పీఏలు) వసూలుకు, మార్కెట్ల నుంచి నిధుల సమీకరణ దిశగా వాటిని ప్రోత్సహించొచ్చని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. అలాగే, ప్రభుత్వరంగ బ్యాంకులు తమకు అనుబంధ కంపెనీల్లో, జాయింట్‌ వెంచర్లలో ఉన్న వాటాల విక్రయం ద్వారా నిధులు సమీకరించొచ్చని ఆ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు కొన్నింటికి బీమా, మ్యూచువల్‌ ఫండ్స్, క్రెడిట్‌కార్డుల వ్యాపారంతోపాటు ఎన్‌ఎస్‌ఈ తదితర సంస్థల్లో వాటాలు సైతం ఉన్నాయి. ఫిబ్రవరి 1న పార్లమెంటుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ సమర్పించనున్నారు.

మరిన్ని వార్తలు