-

అరబిందో విస్తరణకు గ్రీన్‌ సిగ్నల్‌

30 Apr, 2019 08:05 IST|Sakshi

హైదరాబాద్‌: అరబిందో ఫార్మా విస్తరణ ప్రణాళికకు పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి లభించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో రూ.250 కోట్ల మూలధన వ్యయంతో ఏర్పాటుచేయనున్న ఉత్పత్తి కేంద్రానికి సోమవారం గ్రీన్‌ సిగ్నల్‌ లభించినట్లు సంస్థ ప్రకటించింది. ఈ కేంద్రంలో ప్రస్తుతం 583.31 టీపీఎం (ఒక నెల్లో ఉత్పత్తి అయ్యే మొత్తం టన్నులు) భారీ ఔషధాలు, ఇంటర్మీడియట్‌ ఉత్పత్తి సామర్థ్యం ఉండగా.. విస్తరణ అనంతరం ఇది 1,518.3 టీపీఎంకు చేరుతుందని వివరించింది. ఈ యూనిట్‌లో 8.85 మెగావాట్ల క్యాపిటివ్‌ పవర్‌ ప్లాంటును సైతం నెలకొల్పనుంది. పర్యావరణ కాలుష్య నియంత్రణ చర్యల కోసం రూ.32.77 కోట్లుగా అంచనావేసింది. ప్రాజెక్ట్‌ ద్వారా 600 మందికి ప్రత్యక్షంగానూ, 120 మందికి పరోక్షంగానూ ఉపాధి లభించనున్నట్లు వెల్లడించింది.

మరిన్ని వార్తలు