తగ్గనున్న మొండి బకాయిల భారం

29 Aug, 2018 00:37 IST|Sakshi

ఇక్రా నివేదిక

ముంబై: భారత్‌ బ్యాంకుల స్థూల మొండిబకాయిల (ఎన్‌పీఏ) భారం తగ్గనుందని  క్రెడిట్‌ రేటింగ్‌ సంస్థ– ఇక్రా విశ్లేషించింది. 2019 మార్చి నాటికి మొత్తం రుణాల్లో 10 శాతంగా ఉంటుందని అంచనావేస్తోంది. 2018 జూన్‌ 30 నాటికి భారత్‌ బ్యాంకింగ్‌ మొండిబకాయిల భారం 11.52 శాతం. ఇక నికర ఎన్‌పీఏల భారం ఈ ఏడాది జూన్‌ ముగింపు నాటికి 5.92 శాతం ఉంటే 2019 మార్చి నాటికి ఈ రేటు 4.3 శాతానికి తగ్గుతుందని విశ్లేషించింది. 

బ్యాంకింగ్‌ మొండిబకాయిల్లో దాదాపు 60 శాతం పరిష్కార క్రమంలో ఉన్నాయని, తన సానుకూల అంచనాలకు ఇదే కారణమని తాజా నివేదికలో పేర్కొంది. అయితే ఒకవేళ మొండిబకాయిల పరిష్కార క్రమం విఫలమయితే మాత్రం 2019 మార్చి నాటికి స్థూల మొండి బకాయిలు 12.2 శాతంగా, నికర మొండిబకాయిలు 5.6 శాతంగా ఉంటాయన్నది తమ అంచనా అని ఇక్రా పేర్కొంది.  

మరిన్ని వార్తలు