దేశీ ఐటీపై పెరుగుతున్న వ్యయాలు

6 Jan, 2018 01:40 IST|Sakshi

2018లో 11.6 శాతం పెరిగే అవకాశం

రూ.2,33,273 కోట్లుగా ఉండొచ్చని అంచనా  

న్యూఢిల్లీ: డిజిటల్‌ సేవల వ్యాప్తి దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో దేశీయంగా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీపై (ఐటీ) చేసే వ్యయాలు ఈ ఏడాది 11.6 శాతం పెరిగి రూ.2,33,273 కోట్లకు చేరనున్నట్టు ‘క్యూస్‌ ఏజ్‌’ కన్సల్టింగ్‌ సంçస్థ తన నివేదికలో తెలియజేసింది. 2017లో ఐటీ కోసం నిధుల వినియోగం 12.9 శాతం ఉంటుందని అనుకుంటే, దీనికంటే తక్కువగా 10.3 శాతమే సాధ్యమైంది. దీనికి పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ కారణాలుగా క్యూస్‌ ఏజ్‌ కన్సల్టింగ్‌ వ్యవస్థాపకుడు కపిల్‌దేవ్‌ సింగ్‌ పేర్కొన్నారు.

2018లో కంపెనీలు, ప్రభుత్వం ఐటీపై చేసే వ్యయాల్లో 25 శాతం డిజిటల్‌ టెక్నాలజీ కోసమే ఉంటాయని సంçస్థ అంచనా వేసింది. ఇందులో అనలిటిక్స్, మొబిలిటీ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ఉంటాయని తెలియజేసింది. ఐటీ కంపెనీల అధిపతులు, సీఐవోల అభిప్రాయాల ఆధారంగా క్యూస్‌ ఏజ్‌ కన్సల్టింగ్‌ ఈ నివేదికను రూపొందించింది. 60 శాతానికి పైగా కంపెనీలు ఆధునిక డిజిటల్‌ టెక్నాలజీలైన బిగ్‌డేటా అనలిటిక్స్, ఆఫ్టిïషియల్‌ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ), మెషిన్‌ లెర్నింగ్, రోబోలపై ఆసక్తిని ప్రదర్శించాయి.

డిజిటల్‌లో తొలి విప్లవం సోషల్, మొబైల్, అనలైటిక్స్, క్లౌడ్‌ (ఎస్‌ఎంఏసీ) రూపంలో ఉందని, కంపెనీలు తమ వ్యాపార విభాగాల్లో వీటిని అమలు చేస్తున్నాయని సింగ్‌ పేర్కొన్నారు. 2018లో డిజిటల్‌లో రెండో విప్లవం బిగ్‌ డేటా అనలైటిక్స్, ఏఐ, ఐవోటీ, మెíషీన్‌ లెర్నింగ్, రోబోల రూపంలో ఉంటుందని, 18–24 నెలల్లో ఇది ప్రధాన విభాగంగా మారుతుందని కపిల్‌ వివరించారు.

మరిన్ని వార్తలు