ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లోనే వృద్ధి 

18 Jan, 2020 01:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఐటీ కేంద్రాలకు దగ్గరగా ఉండటం, ఔటర్‌ రింగ్‌ రోడ్డు విస్తృతమైన అనుసంధానం, మెట్రో రైల్‌కు సులువుగా చేరుకునే వీలుండటంతో హైదరాబాద్‌లో ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో రియల్‌ పరుగులు పెడుతోంది. గచ్చిబౌలి, కూకట్‌పల్లి, ప్రగతి నగర్, నిజాంపేట, మియాపూర్, కొండాపూర్, బాచుపల్లి, మణికొండ ప్రాంతాల్లో స్థిరాస్తి రంగం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుందని మ్యాజిక్‌బ్రిక్స్‌.కామ్‌ క్యూ4 నివేదిక తెలిపింది.

ఓఆర్‌ఆర్‌తో అనుసంధానమై ఉండటంతో కొంపల్లి, ఆదిభట్ల, తెల్లాపూర్, పటాన్‌చెరు వంటి రియల్‌ జోష్‌ అందుకుంది. హైదరాబాద్‌లో 47 శాతం మంది చ.అ.కు రూ.4 వేల లోపు ధర ఉన్న గృహాల కొనుగోళ్లకే ఆసక్తి చూపిస్తున్నారు. 37 శాతం మంది రూ.4,000 – రూ.6,000 ధర ఇళ్ల వైపు చూస్తున్నారని తెలిపింది. వార్షిక ప్రాతిపదికన నగరంలో గృహాల ధరలు 15.1 శాతం వృద్ధి చెందాయి. మార్కెట్‌ సెంటిమెంట్, రాజకీయ స్థిరత్వం, మౌలిక వసతులు మెరుగవటం ఇందుకు కారణాలని పేర్కొంది.  

మరిన్ని వార్తలు