స్వల్పంగా పెరిగిన జీఎస్‌టీ వసూళ్లు

1 Aug, 2018 19:52 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ:   జూలై నెలలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జిఎస్‌టీ) వసూళ్లు   స్వల్ప వృద్ధిని నమోదు చేసాయి.  ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం గత నెలలో 96,483 కోట్ల రూపాయలుతో పోలిస్తే  రూ. 873 కోట్ల మేర  పెరిగాయి. అంచనాలకనుగుణంగానే ఈ మాసంలో 95,610 కోట్ల రూపాయలు వసూలైనాయి.  సెంట్రల్ జీఎస్‌టీ రూ. 15,877 కోట్లు, రాష్ట్ర జిఎస్‌టీ  రూ. 22,293 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జిఎస్‌టీ రూ. 49,951 కోట్లు (దిగుమతులపై సేకరించిన 24,852 కోట్ల రూపాయలు) సెస్ రూ. 8,362 కోట్ల రూపాయలు (దిగుమతులపై రూ .794 కోట్లు)గా నమోదయ్యాయి. అలాగే జూలై 31, 2018 వరకు జూలై నెలలో మొత్తం గరిష్ఠంగా 3 లక్షల రిటర్న్స్ దాఖలుకాగా  66 లక్షల రూపాయలు  వసూలైనాయి. 

మరిన్ని వార్తలు