రూ లక్ష కోట్లు దాటిన ఆ వసూళ్లు..

1 Dec, 2019 14:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనం నేపథ్యంలోనూ నవంబర్‌ మాసంలో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్ధాయిలో నమోదయ్యాయి. 2017 జులైలో జీఎస్టీ అమలు ప్రారంభమైనప్పటి నుంచి ఇవి మూడో అత్యధిక వసూళ్లుగా నమోదయ్యాయి. నవంబర్‌లో రూ 1,03,492 కోట్ల జీఎస్టీ వసూలైంది. ఇందులో రూ సెంట్రల్‌ జీఎస్టీ వాటా రూ 19,592 కోట్లు కాగా, స్టేట్‌జీఎస్టీ వాటా రూ 27,144 కోట్లు, ఉమ్మడి జీఎస్టీ రూ 49,028 కోట్లని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా జీఎస్టీ అమలవుతున్నప్పటి నుంచి పన్ను వసూళ్లు రూ లక్ష కోట్లు దాటడం​ ఇది ఎనిమిదివసారి కావడం గమనార్హం. ఇక ఈ ఏడాది అక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్లు 95,880 కోట్లు కాగా, గత ఏడాది ఇదే (నవంబర్‌)నెలలో జీఎస్టీ వసూళ్లు రూ 97,637 కోట్లుగా నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు