పడిపోయిన జీఎస్‌టీ వసూళ్లు

1 Jul, 2019 20:16 IST|Sakshi

రూ. లక్షకోట్ల దిగువకు జీఎస్‌టీ వసూళ్లు

సాక్షి,  న్యూఢి​ల్లీ :  జీఎస్‌టీ వసూళ్లు జూన్‌ మాసంలో పడిపోయాయి. వరుసగా లక్ష కోట్ల రూపాయల రికార్డు వసూళ్లను సాధించిన అనంతరం  ఈ  నెలలో రూ. 99,939 కోట్లకు పడిపోయాయి.  జీఎస్‌టీ వసూళ్ల గణాంకాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. ఇందులో సెంట్రల్ జీఎస్టీ రూ.18,366 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ, రూ.25,343 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ. 47,772 కోట్లు (దిగుమతులపై సరూ. 21,980 కోట్లతో సహా) సెస్, 8,457 కోట్లు (దిగుమతులపై సేకరించిన 6 876 కోట్లతో సహా)  అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మే నెలలో 1,00,289 కోట్ల రూపాయలను  వసూలు చేసిన సంగతి  తెలిసిందే. 

మరిన్ని వార్తలు