జీఎస్టీ వసూళ్లు తగ్గాయ్‌..

1 Sep, 2019 17:44 IST|Sakshi

న్యూఢిల్లీ : జీఎస్టీ వసూళ్లు ఆగస్ట్‌ మాసంలో రూ లక్ష కోట్ల నుంచి రూ 98,202 కోట్లకు పడిపోయాయని ప్రభుత్వం ఆదివారం వెల్లడించిన అధికారిక గణాంకాల్లో పేర్కొంది. జూలైలో జీఎస్టీ నుంచి ప్రభుత్వ ఖజానాకు రూ 1.02 లక్షల కోట్లు సమకూరగా, ఆగస్ట్‌లో పన్ను రాబడి గణనీయంగా తగ్గింది. అయితే గత ఏడాది ఇదే మాసంతో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు 4.5 శాతం అధికం. ఈ ఏడాది జీఎస్టీ వసూళ్లు రూ లక్ష కోట్ల దిగువకు పడిపోవడం ఇది రెండవసారి. జూన్‌లో సైతం జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లకు దిగువన రూ 99,939 కోట్లకు తగ్గిపోయాయి. కాగా ఆగస్ట్‌లో సెంట్రల్‌ జీఎస్టీ వసూళ్లు రూ 17,733 కోట్లు కాగా, స్టేట్‌ జీఎస్టీ రూ 24,239 కోట్లు, ఉమ్మడి జీఎస్టీ రూ 48,958 కోట్లుగా నమోదయ్యాయని ప్రభుత్వ గణాంకాలు పేర్కొన్నాయి. మరోవైపు జీఎస్టీ వసూళ్లు రూ లక్ష కోట్ల దిగువకు పడిపోవడంతో ఆర్థిక వ్యవస్థ మందగమనానికి ఇది సంకేతమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తలు