జీఎస్‌టీ వార్షిక రిటర్నుల గడువు తేదీ పొడిగింపు

15 Nov, 2019 11:06 IST|Sakshi

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను పరిధిలోని ట్యాక్స్‌ పేయర్లకు ఊరట లభించింది. జీఎస్‌టీ వార్షిక రిటర్న్స్‌ (జీఎస్‌టీఆర్‌–9) దాఖలు చేయడానికి గడువు తేదీలను కేంద్రం పొడిగించింది. 2017–18 రిటర్నులను దాఖలు చేయడానికి ఈ ఏడాది డిసెంబర్‌ 31 గడువు తేదీ కాగా, 2018–19 రిటర్నుల చివరి తేదీ వచ్చే ఏడాది మార్చి 31గా ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా సమన్వయ నివేదిక (రికన్సిలియేషన్‌ స్టేట్‌మెంట్‌) దాఖలు తేదీల్లో కూడా మార్పులు చేసింది. మరోవైపు, జీఎస్‌టీ ఫామ్‌లను మరింత సులభతరం చేస్తున్నట్లు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ మండలి (సీబీఐసీ) ఒక ప్రకటనలో తెలిపింది.

మరిన్ని వార్తలు