జీఎస్‌టీ ఎఫెక్ట్‌: బజాజ్ బైక్స్‌పై డిస్కౌంట్‌

15 Jun, 2017 10:32 IST|Sakshi
జీఎస్‌టీ ఎఫెక్ట్‌: బజాజ్ బైక్స్‌పై డిస్కౌంట్‌

న్యూఢిల్లీ: దేశీయ మూడవ అతిపెద్ద  టూవీలర్‌  మేకర్‌ బజాజ్‌ ఆటో బైక్‌ లవర్స్‌కి తీపి కబురు అందించింది.  జీఎస్‌టీ చట్టం అమలు ప్రతిపాదన నేపథ‍్యంలో బైక్‌ల ధరలను  తగ్గించినట్టు ప్రకటించింది.  కొనుగోలు చేసిన మోటార్సైకిల్ మోడల్‌ ఆధారంగా రూ. 4500 దాకా  డిస్కౌంట్‌  అందిస్తున్నట్టు  కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాదు ఈ ఆదేశాలు వెంటనే (జూన్‌ 14) అమల్లో ఉంటాయని వెల్లడించింది.  

ఈ డిస్కౌంట్‌ ధరలు ప్రతి రాష్ట్రాలకు మారుతుంటాయని, మోటారుసైకిల్ మోడల్‌ ఆదారంగా విభిన్నంగా ఉంటాయని బజాజ్‌ ఆటో తెలిపింది.  జూన్ 14 నుంచి  జూన్ 2017 మధ్య బుకింగ్స్‌ , డిస్కౌంట్ల కోసం స్థానిక బజాజ్ ఆటో డీలర‍్లను సంప్రదించాలని కోరింది. జీఎస్‌టీ  అమలుకు రంగం సిద్ధమైన తరుణంలో తమ వినియోగదారుకుల సరసమైన ధరల్లో బైక్‌ లనుఅందించాలని నిర్ణయించినట్టు బజాజ్ ఆటో అధ్యక్షుడు ఎరిక్ వాస్   చెప్పారు. ఈ డిస్కౌంట్‌ ద్వారా  తమ కలల బైక్‌ను సొంతం చేసుకునేందుకు కస్టమర్లు  జూలై 1 వరకు వేచి చూడాల్సిన అవసర లేదన్నారు.  కస్లమర్లకు మెరుగైన సేవలు అందిస్తున్న మొట్టమొదటి  దేశీయ సంస్థగా ఉండటం తమకు గర్వకారణమన్నారు.  
కాగా జీఎస్‌టీ  పరిధిలో, ద్విచక్ర వాహనాలపై 28 శాతం పన్ను అమల్లోకి రానుంది.  ప్రస్తుతం ఇది 30శాతం కంటే తక్కువగా ఉంటుంది. 3500 సిసి పైగా ఇంజిన్ సామర్థ్యం ఉన్న బైక్లు 3 శాతం అదనపు  సెస్‌  నిర్ణయించిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు