జీఎస్టీ ఎఫెక్ట్‌ : వాటి ధరలు తగ్గాయి

21 Nov, 2017 19:23 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వినియోగదారుల ఉత్పత్తుల తయారీ కంపెనీ డాబర్‌, షాంపులు, స్కిన్‌-కేర్‌, హోమ్‌ కేర్‌ ప్రొడక్ట్‌ల ధరలను తగ్గించింది. జీఎస్టీ ప్రభావంతో ఇప్పటికే ఉన్న స్టాక్‌పై ధరలను 8-10 శాతం మధ్యలో తగ్గిస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. 9 శాతం ప్రైమరీ డిస్కౌంట్‌తో ప్రయోజనాలను తమ ట్రేడ్‌ పార్టనర్లకు అందిస్తున్నట్టు కంపెనీ పేర్కొంది. జీఎస్టీ చట్టం ప్రకారం, తగ్గించిన పన్ను రేట్లను అమలు చేయడం ప్రారంభించాలని తాము అన్ని వ్యాపారాలు, ట్రేడ్‌ అసోసియేట్లను ఆదేశించినట్టు డాబర్‌ ఇండియా చీఫ్‌ ఫైనాన్సియల్‌ ఆఫీసర్‌ లలిత్‌ మాలిక్‌ చెప్పారు. జీఎస్టీ ప్రయోజనాలు తాము తుది వినియోగదారుడికి అందించనున్నామని పేర్కొన్నారు. 

తాజా ఉత్పత్తులకు కూడా డాబర్‌ తగ్గించిన ఎంఆర్‌పీలను ముద్రిస్తోంది. వచ్చే నెల ఈ కొత్త స్టాక్‌ స్టోర్‌లలోకి రానుంది. జీఎస్టీ ఎంతో ప్రతిష్టాత్మకమైన సంస్కరణ అని, ఇది వ్యాపారాలను సులభతరం చేసినట్టు మాలిక్‌ చెప్పారు. పన్ను రేట్ల తగ్గింపును, తాము వెంటనే కస్టమర్లకు చేరవేసినట్టు పేర్కొన్నారు. జీఎస్టీ రేట్లను సమీక్షించడం స్వాగతించదగ్గ విషయమని, వినియోగదారుల, వ్యాపారాల సెంటిమెంట్‌కు ఇది బూస్ట్‌ ఇస్తుందని మాలిక్‌ తెలిపారు. ఇటీవలే షాంపులు, డిటర్జెంట్లు, కాస్మోటిక్‌, చాకోలెట్లు వంటి 200 వస్తువులపై పన్ను రేట్లను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు