సిగరెట్లు, పొగాకుపై అదనపు ఎక్సైజ్‌ సుంకం తొలగింపు

4 Jul, 2017 00:44 IST|Sakshi
సిగరెట్లు, పొగాకుపై అదనపు ఎక్సైజ్‌ సుంకం తొలగింపు

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పొగాకు, సిగరెట్లు, పాన్‌ మసాలాపై అదనపు ఎక్సయిజ్‌ సుంకాన్ని ఆర్థిక శాఖ తొలగించింది. అదనపు ఎక్సైజ్‌ సుంకం విధిస్తూ 2010 ఫిబ్రవరి 27న జారీ అయిన సెంట్రల్‌ ఎక్సైజ్‌ నోటిఫికేషన్‌ను రెవెన్యూ విభాగం కొట్టి వేసింది. జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్‌టీ కింద.. 28 శాతం పన్ను పరిధిని దాటిన డీమెరిట్, లగ్జరీ గూడ్స్‌పై సెస్సు విధించడం జరుగుతుంది.

దీని ప్రకారం పాన్‌ మసాలాపై సెస్సు 60%, పొగాకుపై 71–204% దాకా ఉంటుంది. ఇక సెంటెడ్‌ జర్దా, ఫిల్టర్‌ ఖైనీపై 160%, గుట్కా ఉన్న పాన్‌మసాలాపై 204 శాతం సెస్సు విధిస్తారు. 65 మి.మీ. పైగా 70 మి.మీ. లోపు పొడవుండే నాన్‌ ఫిల్టర్‌ సిగరెట్స్‌ వెయ్యికి 5 శాతం సెస్సుతో పాటు రూ. 2,876.. ఫిల్టర్‌ సిగరెట్స్‌ అయితే 5 శాతంతో పాటు రూ. 2,126 విధిస్తారు. సిగార్లపై అత్యధికంగా ప్రతి వెయ్యిపై 21 శాతం లేదా రూ. 4,170 (ఏది ఎక్కువైతే అది) సెస్సు ఉంటుంది.
నందన్‌ నీలేకని

మరిన్ని వార్తలు