మొబైల్‌ ఫోన్ల ధరలకు రెక్కలు..

12 Mar, 2020 10:59 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మార్కెట్‌లోకి ఏదైనా స్మార్ట్‌ ఫోన్‌ న్యూ మోడల్‌ రాగానే దాన్ని సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరేవారితో పాటు బడ్జెట్‌ ధరలో మొబైల్‌ ఫోన్లను కొనుగోలు చేసే వారికీ ప్రభుత్వం గట్టి షాక్‌ ఇవ్వనుంది. మొబైల్‌ ఫోన్లపై జీఎస్టీని పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు సాగిస్తోంది. మొబైల్స్‌పై జీఎస్టీ ని 18 శాతానికి పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. శనివారం జరిగే జీఎస్టీ కౌన్సిల్‌ భేటీలోనే ఈ నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. మొబైల్‌ పోన్లతో పాటు ఫుట్‌వేర్‌, టెక్స్‌టైల్స్‌, ఫెర్టిలైజర్స్‌పై జీఎస్టీ రేటును పెంచనున్నారు.

పన్ను వసూళ్ల రాబడిని పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోంది. కాగా, జీఎస్టీ వినియోగదారుల లావాదేవీలు , వ్యాపారుల ఇన్వాయిస్‌లపై  ప్రతి నెలా లక్కీ డ్రాలు నిర్వహించి రూ .10 లక్షల నుంచి రూ .1 కోటి మధ్య లాటరీ ఆఫర్లను ప్రారంభించే ప్రతిపాదననూ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో ఆమోదించవచ్చని భావిస్తున్నారు.

చదవండి : జీఎస్‌టీ లాటరీ : ఇలా చేస్తే కోటి రూపాయలు మీవే!

మరిన్ని వార్తలు